అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Aishwarya Rai | బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ మరోసారి న్యూఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తమ అనుమతి లేకుండా వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు, అలాగే ఏఐ టెక్నాలజీ ద్వారా రూపొందించిన కంటెంట్‌ను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడం వల్ల తాను తీవ్రంగా నష్టపోయానని ఆమె ఆరోపించారు.
దీనిపై ఆమె ₹4 కోట్ల పరువు నష్టం దావా వేయడం చర్చనీయాంశమైంది. ఇదివరకే ఐశ్వర్య రాయ్(Aishwarya Rai) దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించిన ఢిల్లీ హైకోర్టు, ఆమె అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలు, కంటెంట్‌ను వాడకూడదు అంటూ స్పష్టం చేసింది.
Aishwarya Rai | ఏఐ కంటెంట్‌తో మరో వివాదం..
ఆ మేరకు గూగుల్, కొన్ని ఇ-కామర్స్ వెబ్‌సైట్లు, ఇతర డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు ఆదేశాలు జారీ చేసింది. 72 గంటల లోపు సంబంధిత URLలను తొలగించి బ్లాక్ చేయాలని నోటీసులు పంపించింది. ఈ ఆదేశాల తర్వాత కూడా కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో(YouTube Channels) ఐశ్వర్యను పోలిన డీప్‌ఫేక్, ఏఐ ఆధారిత వీడియోలు ప్రత్యక్షమవుతుండటంతో నటి మళ్లీ కోర్టును ఆశ్రయించారు. ఈ వీడియోలు తన గౌరవం, ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని, ఆర్థికంగా, మానసికంగా తాను నష్టపోయినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై కోర్టు(Delhi High Court) స్పందిస్తూ, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత హక్కులు, ప్రచార హక్కులు, ప్రత్యేకంగా సంరక్షించబడాలి. అవును, టెక్నాలజీ అభివృద్ధి కావచ్చు. కానీ అది ఒకరి గౌరవాన్ని నాశనం చేయకూడదని వ్యాఖ్యానించింది. అంతేకాదు, ఈ తరహా కంటెంట్‌ను వెబ్‌ప్లాట్‌ఫామ్‌లు ఫిల్టర్ చేయాల్సిన బాధ్యత తమపై కూడా ఉందని కోర్టు గుర్తు చేసింది.
ఐశ్వర్య రాయ్ వేసిన తాజా దావా నేపథ్యంలో గూగుల్, యూట్యూబ్, ఇతర మల్టీ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు మరోసారి నోటీసులు పంపి, URLలు తొలగించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. సెలబ్రిటీల వ్యక్తిగత హక్కులపై, వారి అనుమతి లేకుండా కంటెంట్‌ను ప్రచురించడం ఎంతటి లీగల్ సమస్యలకు దారి తీస్తుందో ఈ కేసు మరోసారి తెలియజేస్తోంది. టెక్నాలజీ అభివృద్ధిలో భాగంగా ఏఐ, డీప్‌ఫేక్ కంటెంట్(Deepfake Content) వాడకంపై త్వరలోనే మరింత కఠినమైన నిబంధనలు రావొచ్చని న్యాయవర్గాలు భావిస్తున్నాయి.
1 comment
[…] న్యూఢిల్లీ: AI Content New Rules | డీప్‌ఫేక్ deep fake, జనరేటివ్ ఏఐ సాంకేతికతల generative AI technologies […]
Comments are closed.