అక్షరటుడే, బోధన్: AIMIM Bodhan | బీహార్ ఎన్నికలలో (Bihar elections) ఏఐఎంఐఎం పార్టీ ఐదుస్థానాల్లో విజయం సాధించడంతో బోధన్ పట్టణంలో శనివారం సంబరాలు నిర్వహించారు. పట్టణంలోని ఏఐఎంఐఎం పార్టీ కార్యాలయంలో (AIMIM party office) ఆ పార్టీ నాయకులు స్వీట్లు పంచుకున్నారు.
ఈ సందర్భంగా బోధన్ ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షుడు మీరు ఇలియాస్ మాట్లాడుతూ బీహార్ ఎన్నికల్లో ఐదు సీట్లు రావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఈ విజయం అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) కష్టం ఫలితమేనన్నారు. రాబోయే స్థానిక ఎన్నికలలో ఏఐఎంఐఎం పార్టీ తరఫున పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అహ్మద్ బిన్ మోసిన్, ఉమర్, హబీబ్ ఖాన్, మాజీ కౌన్సిలర్ అత్తర్, అఖిల్ ఫారూఖీ, ఎండీ ఆదిల్, హాజీ బిల్డర్, సీనియర్ నాయకులు సాలాంచౌస్, ముస్తాక్ అహ్మద్, షేర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
