ePaper
More
    HomeజాతీయంPlane crash | అహ్మదాబాద్​ విమాన ప్రమాదం.. ఫ్లైట్​లో 242 మంది ప్రయాణికులు

    Plane crash | అహ్మదాబాద్​ విమాన ప్రమాదం.. ఫ్లైట్​లో 242 మంది ప్రయాణికులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Plane crash | దేశంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. గుజరాత్​లోని అహ్మదాబాద్​ ఎయిర్​ పోర్టు (Ahmedabad Airport) నుంచి 242 మంది ప్రయాణికులతో బయలు దేరిన ఎయిర్​ ఇండియా విమానం (Air India plane) టేకాఫ్​ సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పలువురు సజీవ దహనం అయ్యారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

    అహ్మదాబాద్​ ఎయిర్​పోర్టు నుంచి లండన్​కు (London) వెళ్లాల్సిన ఎయిర్​ ఇండియాకు చెందిన AI-171 బోయింగ్​ విమానం 1.17 నిమిషాలకు టేకాఫ్ అయ్యింది. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే సాంకేతిక సమస్య కారణంగా జనావాసాలపై కుప్పకూలింది. అనంతరం ఫైట్​ నుంచి దట్టమైన మంటలు వ్యాపించి చుట్టుపక్కల ప్రాంతాల్లో పొగలు అలుముకున్నాయి. అప్పటికే విమాన ప్రమాదం గుర్తించిన ఏవియేషన్​ అధికారులు, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రెస్యూ ఆపరేషన్​ చేపట్టారు. పదుల కొద్దీ ఫైర్​ ఇంజన్లను మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.

    Plane crash | స్పందించిన అమిత్​ షా

    అహ్మదాబాద్​ విమాన ప్రమాదం ఘటనపై సమాచారం అందుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్​షా (Union Home Minister Amit Shah) హుటాహుటిన గుజరాత్​ సీఎంతో (Gujarat CM) పాటు ఇతర అధికారులతో మాట్లాడారు. వెంటనే సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్​ నాయుడు (Ram Mohan Naidu) హుటాహుటిన గుజరాత్​కు బయలు దేరారు.

    ప్రస్తుతం ఘటన జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కొన ఊపిరితో ఉన్న పలువురిని ఆస్పత్రికి తరలిస్తున్న వీడియోలు సోషల్​ మీడియాలో (Social media) బయటకు వచ్చాయి. కాగా.. విమానం బయలుదేరిన సమయంలో 2 పైలట్లు, 10 క్యాబిన్​ క్రూజ్​ సిబ్బందితో సహా 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

    https://twitter.com/gemsofbabus_/status/1933090154148937934

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...