HomeUncategorizedAhmedabad Plane Crash | అహ్మదాబాద్​ విమాన ప్రమాదం.. ఫ్లైట్​లో మాజీ సీఎం విజయ్​ రుపానీ..?

Ahmedabad Plane Crash | అహ్మదాబాద్​ విమాన ప్రమాదం.. ఫ్లైట్​లో మాజీ సీఎం విజయ్​ రుపానీ..?

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Ahmedabad Plane Crash | అహ్మదాబాద్​ విమాన ప్రమాదం దేశంలో కలకలం రేపింది. అహ్మదాబాద్​ ఎయిర్​ పోర్టు నుంచి 242 మంది ప్రయాణికులతో బయలు దేరిన ఎయిర్​ ఇండియా విమానం టేకాఫ్​ సమయంలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్యపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

అహ్మదాబాద్​ ఎయిర్​పోర్టు నుంచి లండన్​కు వెళ్లాల్సిన ఎయిర్​ ఇండియా విమానం 1.17 నిమిషాలకు టేకాఫ్ అయ్యింది. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే కుప్పకూలింది. అనంతరం ఫైట్​ నుంచి దట్టమైన మంటలు వ్యాపించాయి. ఏవియేషన్​ అధికారులు, స్థానిక పోలీసులు పదుల కొద్దీ ఫైర్​ ఇంజన్లను మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాగా.. విమానంలో గుజరాత్​ మాజీ ముఖ్యమంత్రి విజయ్​ రుపానీ ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ప్రయాణానికి సంబంధించిన విమాన టికెట్​ బయటకు వచ్చింది. అయితే సాయంత్రం 5 గంటల వరకు ఎయిర్​ పోర్టు మూసివేసినట్లు సమాచారం.