అక్షరటుడే, కమ్మర్పల్లి: Kammarpally | మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల (government junior colleges) అధ్యాపకులు శనివారం పలు పాఠశాలల్లో అడ్మిషన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ మేరకు ఉప్లూర్, ఏర్గట్ల, హాసాకొత్తూరు పాఠశాలల్లో అడ్మిషన్ డ్రైవ్ నిర్వహించారు. ప్రభుత్వ కళాశాల్లో ఉన్న వసతులు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకుంటే భవిష్యత్తులో ఉండే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు.
Kammarpally | ఉచిత పుస్తకాలు, ప్రత్యేక తరగతులు..
ప్రభుత్వ కళాశాల్లో ఉచిత పాఠ్య పుస్తకాలతో పాటు, మినరల్ వాటర్, క్రమశిక్షణతో కూడిన విద్య, వారాంతపు పరీక్షలు, ప్రతిరోజు ఒక్కొక్క సబ్జెక్టుకు స్టడీ అవర్స్ నిర్వహిస్తూ ప్రైవేట్ కళాశాలలకు దీటుగా విద్యను అందిస్తున్నట్లు అధ్యాపకులు తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరి తమ భవిష్యత్‌ను ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. డ్రైవ్‌లో కళాశాల అధ్యాపకులు మధుకుమార్, గంగాధర్, శ్రీహరి, వెంకటేష్, మహేందర్, గంగారాం, మురళీకృష్ణ, స్వాతి, స్రవంతి అధ్యాపక బృందం పాల్గొన్నారు.
