అక్షరటుడే, కామారెడ్డి: Adlur Yellareddy | ఉపాధి నిమిత్తం రష్యాకు వెళ్లిన ఓ వ్యక్తి హరియాణాలో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన రెండురోజుల క్రితం జరిగినట్లుగా తెలుస్తోంది.
బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. సదాశివనగర్ మండలం (Sadashivanagar mandal) అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన కటికే రజినీకాంత్ (45) ఎనిమిది నెలల క్రితం ఉపాధి నిమిత్తం రష్యాకు వెళ్లాడు. అక్కడ నుంచి గత నెల 16న ఢిల్లీకి వచ్చి అటునుంచి హరియాణా వెళ్లినట్టుగా తెలుస్తోంది. రెండు రోజుల క్రితం రజినీకాంత్ హరియాణాలో (Haryana) దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే హత్య జరిగి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతుడి వద్ద రక్తపు మరకలతో కూడిన లెక్కలు వేసిన కాగితం లభించినట్టుగా తెలుస్తోంది.
Adlur Yellareddy | ఆర్థిక లావాదేవీలే కారణమా..?
హత్యకు ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హరియాణా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసిన అక్కడి అధికారులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. వారు ప్రత్యేక వాహనంలో స్వగ్రామానికి మృతదేహాన్ని తీసుకుని వస్తున్నారు. అయితే రష్యాకు వెళ్లిన రజినీకాంత్ ఢిల్లీ ఎందుకు వచ్చాడు..? అక్కడి నుంచి హరియాణాలో ఎందుకు వెళ్లాడు అనేది తెలియాల్సి ఉంది. మృతునికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.