Homeజిల్లాలుకామారెడ్డిAdditional Collector Victor | తూకాల్లో వేగం పెంచాలి

Additional Collector Victor | తూకాల్లో వేగం పెంచాలి

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Additional Collector Victor | అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో(Puchasing Centers) తూకాల్లో వేగం పెంచాలని అదనపు కలెక్టర్ విక్టర్(Additional Collector Victor) ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. లింగంపేట మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో(Farmers) మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని ప్రశ్నించారు.

Additional Collector Victor | భూభారతి సర్వే పక్కాగా చేయాలి..

భూభారతి(Bhu Bharathi) చట్టం సర్వేలో వివరాలు పక్కాగా సేకరించాలని అదనపు కలెక్టర్(రెవెన్యూ) విక్టర్ అన్నారు. లింగంపేట్ మండలం నల్లమడుగు, పోతాయిపల్లి గ్రామాల్లో భూభారతి సర్వే టీంలు చేస్తున్న క్షేత్ర పర్యటన వివరాలు తెలుసుకున్నారు. భూభారతి చట్టం ప్రకారం వివరాలు సేకరించాలని, వాటిని డెస్క్​వర్క్(Deskwork) చేయాలని సూచించారు. లింగంపేట్ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ అధికారులు, కేంద్రం నిర్వాహకులు, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు.