అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Raid | మరో అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. ఈ సారి ఏకంగా అదనపు కలెక్టర్ లంచం తీసుకుంటూ దొరికిపోయాడు.
హన్మకొండ (Hanmakonda) జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా ఇన్ఛార్జి విద్యాశాఖ అధికారి వెంకటరెడ్డిని ఏసీబీ అధికారులు శుక్రవారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. రూ.60 వేల లంచం తీసుకుంటుండగా ఆయనను కలెక్టరేట్లో అదుపులోకి తీసుకున్నారు. విద్యాశాఖకు సంబంధించి వ్యవహారంలో ఈ లంచం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారులు కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు. మరికొంత మంది ఉద్యోగులను సైతం విచారిస్తున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ACB Raid | లంచం ఇవ్వొద్దు
ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు (ACB Officers) సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు.
ఎంత మొత్తం లంచం అడిగినా.. వస్తు రూపంలో బహుమతులు అడిగినా తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, ఆ పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
