HomeతెలంగాణMLA Sudarshan Reddy| తహశీల్దార్​, ఎంపీడీవోపై చర్యలకు ఆదేశం

MLA Sudarshan Reddy| తహశీల్దార్​, ఎంపీడీవోపై చర్యలకు ఆదేశం

- Advertisement -

అక్షరటుడే, బోధన్: ఎడపల్లి తహశీల్దార్​, ఎంపీడీవోలపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సుదర్శన్​ రెడ్డి కలెక్టర్​కు సిఫార్సు చేశారు. మంగళవారం ఎడపల్లిలోని తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలను ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో తహశీల్దార్ ధన్వాల్ నాయక్, ఎంపీడీవో శంకర్ నాయక్ ఇద్దరూ కార్యాలయంలో లేరు. దీంతో సదరు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కలెక్టర్​ను కోరారు. ప్రజలకు సేవచేయని అధికారులపై చర్యలు ఉంటాయని ఎమ్మెల్యే హెచ్చరించారు.