Homeక్రైంNoida | వ‌ర‌క‌ట్న హ‌త్యకేసులో నిందితుడిపై కాల్పులు.. త‌ప్పించుకునేందుకు య‌త్నించగా

Noida | వ‌ర‌క‌ట్న హ‌త్యకేసులో నిందితుడిపై కాల్పులు.. త‌ప్పించుకునేందుకు య‌త్నించగా

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Noida | దేశ‌వ్యాప్తంగా సంచల‌నం సృష్టించిన గ్రేట‌ర్ నోయిడా (Greater Noida) వ‌ర‌క‌ట్న హ‌త్య కేసులో నిందితుడిపై పోలీసులు కాల్పులు జ‌రిపారు. భార్య హ‌త్య కేసులో నిందితుడైన భర్త విపిన్‌ను ఆదివారం వైద్య పరీక్షల (medical examination) కోసం తీసుకెళ్తుండగా నిందితుడు పారిపోయే య‌త్నించాడు.

గ్రేటర్ నోయిడాలోని సిర్సా చౌక్ స‌మీపానికి రాగానే పోలీసు సిబ్బంది నుంచి తుపాకీ లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు కాళ్ల‌పై కాల్పులు జ‌రిపారు. ప్ర‌స్తుతం అత‌డు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితుల‌ను ఎన్‌కౌంట‌ర్ చేయాల‌ని మృతురాలి తండ్రి డిమాండ్ చేసిన గంట‌ల వ్య‌వ‌ధిలోనే ఈ ఘ‌ట‌న చోటు చేసుకోవ‌డం విశేషం.

Noida | భార్య‌ను కొట్టి.. నిప్పు పెట్టి

నిక్కీ, ఆమె సోదరి కాంచన్ అన్న‌ద‌మ్ములైన విపిన్, రోహిత్‌లను డిసెంబర్ 10, 2016న వివాహం చేసుకున్నారు. అప్ప‌ట్లోనే భారీగా క‌ట్నం కూడా తీసుకున్నారు. అయితే, పెళ్లయిన ఆర్నెళ్ల నుంచే అక్కాచెల్లెళ్ల‌ను అద‌న‌పు క‌ట్నం వేధించ‌సాగారు. ఈ క్ర‌మంలో గురువారం విపిన్, అత‌ని కుటుంబ సభ్యులు (family members) నిక్కీని దారుణంగా చిత‌క‌బాదారు. తమ ఆరేళ్ల కొడుకు ముందే దారుణంగా దాడి చేసి తగలబెట్టాడు. ఈ దృశ్యాలు ఆన్‌లైన్‌లో వైర‌ల్ (viral online) అయ్యాయి. మ‌రోవైపు మంట‌ల్లో ఉన్న నిక్కీని స్థానికులు కాపాడి ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా చికిత్స పొందుతూ మృతి చెందింది. త‌న చెల్లి మృతికి కార‌ణం భ‌ర్త‌తో పాటు అత్త‌మామ‌లే అని మృతురాలి సోద‌రి కాంచ‌న్ తెలిపింది. ఈ నేప‌థ్యంలో విపిన్‌ను శనివారం అరెస్టు చేయగా, మిగిలిన నిందితులను పట్టుకోవడానికి గాలింపు చర్యలు (viral online) కొనసాగుతున్నాయి.

Noida | న‌మ్మించి..

భార్య‌ను చంపిన విపిన్ ఆత్మ‌హ‌త్య‌గా చిత్రీక‌రించేందుకు య‌త్నించాడు. త‌న భార్య‌, కుమారుడితో ఉన్న ఫొటోనూ సోష‌ల్ మీడియాలో (social media) షేర్ చేస్తూ ప్ర‌పంచం త‌న‌ను హంత‌కుడు అని పిలిస్తోంద‌ని పేర్కొన్నాడు. మ‌రోవైపు, దర్యాప్తు సమయంలో విపిన్ అధికారులకు స‌హ‌క‌రిస్తాన‌ని చెప్పాడు. ఆదివారం అత‌డ్ని వైద్య ప‌రీక్ష‌ల కోసం తీసుకెళ్తుండ‌గా, నిందితుడు పోలీసుల తుపాకీ లాక్కుని పారిపోయేందుకు య‌త్నించాడు. ఈ క్ర‌మంలో పోలీసులు అత‌ని కాళ్ల‌పై కాల్చ‌డంతో కుప్ప‌కూలిపోయాడు. వెంట‌నే అత‌డ్ని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. 28 ఏళ్ల విపిన్ భాటి పోలీసుల కస్టడీ (police custody.) నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పుడు అతని కాళ్ల‌పై కాల్చిన‌ట్లు యూపీ పోలీసులు (UP police) తెలిపారు. నిందితుడు కస్టడీ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించగా, అతనిని వెంబడించామ‌న్నారు. గ్రేటర్ నోయిడాలోని సిర్సా రౌండ్అబౌట్ సమీపంలో విపిన్ పోలీసు పిస్టల్ లాక్కోవడానికి ప్రయత్నించాడని, దీంతో అత‌ని కాలిపై కాల్చిన‌ట్లు తెలిపారు.

Noida | అదిపెద్ద విష‌యం కాదు..

కాల్పుల అనంత‌రం ఆసుపత్రిలో చేరిన విపిన్ వార్తా సంస్థ ANIతో మాట్లాడుతూ, “నేను ఏమీ చేయలేదు. ఆమె తనంతట తానుగా మరణించింది” అని అన్నాడు. “భార్యాభర్తల మధ్య తగాదాలు ప్రతిచోటా జరుగుతాయి. అది పెద్ద విషయం కాదు” అని అతను పేర్కొన‌డం గ‌మ‌నార్హం.