HomeతెలంగాణACB Raids | ల్యాండ్​ సర్వే, రికార్డ్స్​ ఏడీ ఇంట్లో ఏసీబీ సోదాలు.. ఆస్తులు చూస్తే...

ACB Raids | ల్యాండ్​ సర్వే, రికార్డ్స్​ ఏడీ ఇంట్లో ఏసీబీ సోదాలు.. ఆస్తులు చూస్తే షాక్​ కావాల్సిందే

రంగారెడ్డి ల్యాండ్‌, రికార్డ్స్​ అసిస్టెంట్​ డైరెక్టర్ శ్రీనివాసులు భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids | రంగారెడ్డి (Rangareddy) ల్యాండ్‌, రికార్డ్స్​ అసిస్టెంట్​ డైరెక్టర్ కె శ్రీనివాసులు నివాసంలో గురువారం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆయన ఇళ్లతో పాటు కలెక్టరేట్​లో సైతం సోదాలు చేపట్టారు.

అక్రమాస్తుల కేసులో హైదరాబాద్ , రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో తనిఖీలు చేపట్టారు. తన సర్వీసు కాలంలో అవినీతి కార్యకలాపాల ద్వారా ఆదాయ వనరులకు మించి ఆస్తులను సంపాదించినందుకు శ్రీనివాసులపై కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో అతని ఇంట్లో, బంధువులు, స్నేహితులు, బినామీలు ఇతర సహచరులకు చెందిన 6 ప్రదేశాలలో సోదాలు చేపట్టామన్నారు.

ACB Raids | ఆస్తుల వివరాలు..

ఏడీ శ్రీనివాసులుకు హైదరాబాద్​ (Hyderabad)లోని మై హోమ్​ భూజాలో ఓ ఫ్లాట్​ ఉంది. నారాయణపేటలో రైస్​మిల్లు, 11 ఎకరాల వ్యవసాయ భూమి, అనంతపురంలో 11 ఎకరాల భూమి, కర్ణాటకలో మరో 11 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మహబూబ్​నగర్​లో నాలుగు, నారాయణపేట్​లో మూడు ప్లాట్లు ఉన్నాయి. సోదాల్లో భాగంగా అధికారులు రూ.5 లక్షల నగదు, 1.6 కిలోల బంగారం, 770 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు. ఒక కియ సెల్టోస్​, ఇన్నోవా కార్లు అతడి పేరు మీద ఉన్నట్లు గుర్తించారు. స్థిర, చరాస్తుల మార్కెట్ విలువ డాక్యుమెంట్ విలువ కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈడీ శ్రీనివాస్​ షెల్​ కంపెనీలు సృష్టించి వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం.

Must Read
Related News