Homeజిల్లాలునిజామాబాద్​ACB Trap | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్​ కమిషనర్​

ACB Trap | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్​ కమిషనర్​

ఆర్మూర్​ మున్సిపల్​ కమిషనర్​ రాజు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఇంటి నంబర్​ కేటాయించడానికి రూ.20 వేలు డిమాండ్​ చేశాడు.

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్​ : ACB Trap | మరో అవినీతి అధికారి ఏసీబీ వలకు చిక్కాడు. ఆర్మూర్​ మున్సిపల్​ కమిషనర్​ ఏ రాజు (Municipal Commissioner A Raju) లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

అవీనితి అధికారులు మారడం లేదు. నిత్యం ఏసీబీ దాడులు (ACB raids) చేపడుతున్నా భయపడటం లేదు. తమ వద్దకు వచ్చే ప్రజలను లంచాల పేరిట పట్టి పీడిస్తున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లా (Nizamabad district) ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్, అతని డ్రైవర్ (ప్రైవేట్ వ్యక్తి)ని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పట్టణ పరిధిలో నిర్మించిన ఇంటికి నంబర్​ కేటాయించడానికి మున్సిపల్ కమిషనర్​ రాజు రూ.20 వేల లంచం డిమాండ్​ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు గురువారం మున్సిపల్ కమిషనర్​ (Municipal Commissioner) తన డ్రైవర్ భూమేశ్​​ ద్వారా లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం డ్రైవర్​ బ్యాగ్​ను చెక్​ చేయగా.. లెక్కల్లో చూపని రూ.4.30 లక్షల నగదు గుర్తించారు. ఆ డబ్బును స్వాధీనం చేసుకొని కమిషనర్​తో పాటు డ్రైవర్​ను అరెస్ట్​ చేశారు.

ACB Trap | యథేచ్ఛగా అవినీతి

నిజామాబాద్​ జిల్లాలోని మున్సిపాలిటీల్లో అవినీతి రాజ్యం ఏలుతోంది. కొందరు అధికారులు అందిన కాడికి దండుకుంటున్నారు. ముఖ్యంగా ఇంటి పర్మిషన్ల కోసం భారీగా డబ్బులు డిమాండ్​ చేస్తున్నారు. ప్రతి పనికి ఓ రేటు కడుతున్నారు. ఇటీవల నిజామాబాద్​ మున్సిపల్ కార్పొరేషన్​ కార్యాలయంలో (Nizamabad Municipal Corporation office) ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. తాజాగా ఆర్మూర్​ మున్సిపల్ కమిషనర్​ను రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

ACB Trap | లంచం అడిగితే ఫోన్​ చేయండి

ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు (ACB Officers) సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్​ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్​ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number)​, వాట్సాప్ నంబర్​ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.

Must Read
Related News