అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Raids | హన్మకొండ అదనపు కలెక్టర్ ఇంట్లో ఏసీబీ అధికారులు (ACB Officers) దాడులు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్లు అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో అధికారులు సోదాలు చేపట్టారు.
హన్మకొండ అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి (Additional Collector Venkat Reddy) ఇంట్లో ఏసీబీ అధికారులు బుధవారం తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్, మిర్యాలగూడ, నల్గొండలోని ఆయన నివాసాలతో పాటు బంధువుల ఇళ్లలో సైతం సోదాలు చేస్తున్నారు. ఆయన భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు సమాచారం. గత నెలలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఈ క్రమంలో తాజాగా తనిఖీలు జరుగుతున్నాయి.
ACB Raids | రూ.60 వేలు లంచం తీసుకుంటూ..
హన్మకొండ అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి గతంలో జిల్లా ఇన్ఛార్జి విద్యాశాఖ అధికారిగా కూడా కొనసాగారు. ఈ క్రమంలో ఆయన డిసెంబర్ 5న ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం నుంచి లంచం తీసుకుంటూ దొరికాడు. ఓ ప్రైవేట్ పాఠశాల గుర్తింపు పత్రాల పునరుద్ధరణ కోసం ఆయన రూ.60 వేలు తీసుకుంటూ కలెక్టరేట్లోనే (Collectorate) దొరికిపోయాడు. ఆ సమయంలో కార్యాలయంలో, ఆయన నివాసంలో అధికారులు సోదాలు చేయగా భారీగా నగదు బయట పడింది. దీంతో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ మేరకు తాజాగా అధికారులు ఏకకాలంలో పలు ప్రాంతాల్లో దాడులు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.