అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Raids | ఏసీబీ అధికారులు (ACB Officers) దూకుడు పెంచారు. నిత్యం దాడులు చేపడుతూ.. అవినీతి అధికారులను హడలెత్తిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు లంచాలు తీసుకుంటున్న వారిని వలపన్ని పట్టుకుంటున్నారు. అలాగే అక్రమాస్తుల కేసులో ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు.
రంగారెడ్డి ల్యాండ్ రికార్డ్స్ ఈడీ శ్రీనివాస్ (ED Srinivas) నివాసంలో గురువారం అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆయన ఇళ్లతో పాటు కలెక్టరేట్లో సైతం సోదాలు చేపట్టారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో తనిఖీలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా (Rangareddy District)లో ఆరు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. ల్యాండ్ రికార్డ్స్ (Land Records) ఈడీగా శ్రీనివాస్ పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టినట్లు అధికారులు గుర్తించారు.
ACB Raids | షెల్ కంపెనీలతో వ్యాపారం
ఈడీ శ్రీనివాస్ షెల్ కంపెనీలు సృష్టించి వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం (Rangareddy Collector Office)తో పాటు రాయదుర్గం మై హోమ్ భుజలో సైతం ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన మహబూబ్‌నగర్‌లో ఓ రైస్‌మిల్లు కూడా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
