Karnataka Incident | తల్లిదండ్రులతో పాటు చెల్లి హత్య.. ఇంట్లోనే పాతి పెట్టి మిస్సింగ్​ కేసు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Karnataka Incident | కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు తన తల్లిదండ్రులతో పాటు చెల్లిని హత్య చేశాడు. అనంతరం ఇంట్లోనే పూడ్చి పెట్టారు. కర్ణాటకలోని విజయనగర జిల్లా (Vizianagaram District) కొట్టూరు గ్రామంలో జయలక్ష్మి(45), భీమరాజ్(50) దపంతులకు అక్షయ్​కుమార్​ (24), అమృత(17) అనే పిల్లలు ఉన్నారు. అక్షయ్​ కుమార్​ టైర్ల షాపు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. చిత్రదుర్గ నగరం కిట్టిహళ్లికి చెందిన అక్షయ్ రెండేళ్ల క్రితం కుటుంబంతో కలిసి కొట్టూరు వెళ్లాడు. […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Karnataka Incident | కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు తన తల్లిదండ్రులతో పాటు చెల్లిని హత్య చేశాడు. అనంతరం ఇంట్లోనే పూడ్చి పెట్టారు.

కర్ణాటకలోని విజయనగర జిల్లా (Vizianagaram District) కొట్టూరు గ్రామంలో జయలక్ష్మి(45), భీమరాజ్(50) దపంతులకు అక్షయ్​కుమార్​ (24), అమృత(17) అనే పిల్లలు ఉన్నారు. అక్షయ్​ కుమార్​ టైర్ల షాపు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. చిత్రదుర్గ నగరం కిట్టిహళ్లికి చెందిన అక్షయ్ రెండేళ్ల క్రితం కుటుంబంతో కలిసి కొట్టూరు వెళ్లాడు. ఈ క్రమంలో ఈ నెల 27న అతడు తన తల్లిదండ్రులతో పాటు చెల్లి అమృతను హత్య చేశాడు. అనంతరం ఇంట్లోనే వారి మృతదేహాలను పూడ్చి పెట్టాడు.

Karnataka Incident | అనుమానం రావడంతో..

అక్షయ్​ కుమార్ బెంగళూరు (Bengaluru) వెళ్లి తిలక్ నగర్ పోలీస్ స్టేషన్‌ (Tilak Nagar Police Station)లో తన తండ్రి, తల్లి, చెల్లి కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే అక్షయ్​ కుమార్​ తీరుపై అనుమానం రావడంతో ప్రశ్నించారు. దీంతో తానే హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. అయితే ఎందుకు హత్య చేశాడనే వివరాలు తెలియరాలేదు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయనగర ఎస్పీ ఎస్ జాహ్నవి (SP Jahnavi), కుడ్లిగి డీఎస్పీ మల్లేష్ (DSP Mallesh) సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...