అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bus Accident | రోడ్డు ప్రమాదాలు (Road Accidents) ప్రయాణికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఎక్కువగా ప్రమాదాల బారిన పడుతున్నాయి.
ఆగి ఉన్న మినీ లారీని ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (Private Travel Bus) ఢీకొంది. అనంతరం ఆ బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఏపీలోని మార్కాపురం నియోజకవర్గం (Markapuram Constituency) కొనకమిట్ల మండలం చిన్నారికట్ల వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి, 12 మందికి గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
Bus Accident | కాకినాడలో..
కాకినాడ (Kakinada) సమీపంలోని తునిలో ముందు వెళ్తున్న లారీని ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మృతి చెందాగా.. నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Bus Accident | డివైడర్‌పైకి ఎక్కిన లారీ
ఓ లారీ అదుపు తప్పి డివైడర్ పైకి ఎక్కింది. దీంతో హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ఓ లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపుతప్పి డివైడర్ మీదకి ఎక్కింది. లారీ నిలిచిపోవడంతో రహదారికి ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. క్రేన్ సాయంతో పోలీసులు లారీని తొలగించి, ట్రాఫిక్ క్లియర్ చేశారు.