అక్షరటుడే, భీమ్‌గల్ : Velpur Mandal | ఆడుకుంటున్న బాలుడిని కారు రూపంలో మృత్యువు కబళించింది. అమ్మమ్మ ఇంటికి ఆనందంగా గడుపుదామని వచ్చిన బాలుడి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
వేల్పూర్ మండలం మోతే గ్రామం (Mothe Village)లో బుధవారం మూడేళ్ల బాలుడిని కారు ఢీకొంది. స్థానికులు మరియు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఆర్మూర్ మండలం (Armoor Mandal)పెర్కిట్ గ్రామానికి చెందిన దావుల ఎహెన్స్ (3) తన తల్లిదండ్రులతో కలిసి వేల్పూర్ మండలం మోతే గ్రామంలోని అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. బుధవారం సాయంత్రం సుమారు 4:30 గంటల సమయంలో బాలుడు ఇంటి బయట వాకిట్లో ఆడుకుంటున్నాడు.
Velpur Mandal | రివర్స్ తీస్తుండగా..
ఓ కారును అజాగ్రత్తగా రివర్స్ తీస్తుండగా.. బాలుడిని ఢీకొంది. బాలుడికి తలకు తీవ్ర గాయమైంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని చికిత్స నిమిత్తం ఆర్మూర్‌లోని ఆనంద్ ఆసుపత్రి (Anand Hospital)కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఎహెన్స్ మృతి చెందాడు. ఆడుకుంటూ కళ్లముందే తిరుగుతున్న చిన్నారి మృతి చెందడంతో మోతే, పెర్కిట్ గ్రామాల్లో (Perkit Village) విషాద ఛాయలు అలుముకున్నాయి.