అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Lava Blaze Duo 3 5G | ప్రముఖ దేశీయ స్మార్ట్ ఫోన్ (Smart Phone) తయారీ కంపెనీ లావా నుంచి సరికొత్త మోడల్‌ను రిలీజ్ చేసింది. డ్యూయల్ స్క్రీన్ దీని ప్రత్యేకత. గతంలో విడుదలైన Lava Blaze Duo స్మార్ట్ ఫోన్‌కు అడ్వాన్స్‌డ్ వర్షన్‌గాను తీసుకువచ్చింది. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7060 ప్రాసెసర్ అమర్చారు. అమెజాన్ (Amazon), లావా ఇండియా (Lava India) అధికారిక వెబ్‌సైట్‌లతో పాటు దేశంలోని ప్రముఖ ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్‌లోనూ అందుబాటులో ఉండనుంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి.
డిస్‌ప్లే : 6.67 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే, 1.6 ఇంచ్ సెకండరీ అమోలెడ్ డిస్ ప్లే ఉన్నాయి. 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 1200 x 2652 పిక్సల్స్ రిజల్యూషన్, IP64 డస్ట్ అండ్ స్ప్లాష్ ప్రొటెక‌్షన్ కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణ ఇస్తుంది.
సాఫ్ట్‌వేర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 7060 ప్రాసెసర్ అమర్చారు. ఇది ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా పనిచేస్తుంది.
కెమెరా సెటప్ : వెనకవైపు 50 మెగా పిక్సెల్ మెయిన్ సోనీ కెమెరాతో పాటు 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెట్ అప్ ఉంది. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
బ్యాటరీ సామర్థ్యం : 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంగల ఈ ఫోన్.. 33W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.
వేరియంట్ : సింగిల్ వేరియంట్‌లో తీసుకువచ్చారు. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 16,999.
కార్డ్ ఆఫర్స్ : అమెజాన్‌లో కొనుగోలు చేసేవారికి అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్‌కార్డ్‌తో కొనుగోలు చేస్తే 5 శాతం వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది.
ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌తో గరిష్టంగా 750 వరకు డిస్కౌంట్ వర్తించనుంది.