అక్షరటుడే, గాంధారి : Athletics Tournament | రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్ పోటీలకు గాంధారి మండలానికి (Gandhari Mandal) చెందిన కేతావత్ సాయి చెల్సియా రాథోడ్ ఎంపికైంది. ఈ మేరకు బామన్ నాయక్ స్పోర్ట్స్ ఫౌండేషన్ చీఫ్ ప్యాట్రాన్ గుగ్లోత్ సురేందర్, అధ్యక్షురాలు సేవంత శనివారం వివరాలు వెల్లడించారు.
Athletics Tournament | ఇందిరాగాంధీ క్రీడా మైదానంలో..
కామారెడ్డి జిల్లా (Kamareddy District) కేంద్రంలోని ఇందిరాగాంధీ క్రీడా మైదానంలో జనవరి 9న జరిగిన జిల్లాస్థాయి పోటీలో ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయకి కేతావత్ సాయి చెల్సియా రాథోడ్ ఎంపికైందని పీఈటీ లక్ష్మణ్ రాథోడ్ తెలిపారు. జనవరి 17న ఆదిలాబాద్ జిల్లాలోని ఇందిర ప్రియదర్శిని క్రీడా మైదానం జరిగే రాష్ట్రస్ఠాయి పోటీలకు కామారెడ్డి జిల్లా జట్టుకు ప్రాతినిథ్యం క్రీడాకారిణి ప్రాతినిథ్యం వహించనుంది. 60మీ మీటర్ల పరుగుపందెం పోటీల్లో పాల్గొననుందని ఆయన తెలిపారు. విద్యార్థిని ప్రస్తుతం కేటీఎస్ పాఠశాల (KTS School)లో మూడో తరగతి చదువుతోందన్నారు.