అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jharkhand Encounter | మావోయిస్ట్‌లకు మరో ఎదురుదెబ్బ తగిలింది. జార్ఖండ్ సారండా అటవీ (Saranda Forest) ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో తాజాగా పది మంది నక్సల్స్ హతం అయ్యారు.
జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలోని సారండా అడవుల్లో గురువారం ఉదయం ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. కమాండో బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్ (కోబ్రా) 209 బెటాలియన్ నేతృత్వంలోని భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ (Search Operation) చేపట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు కనిపించడంతో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో టాప్ కమాండర్లతో సహా కనీసం పది మంది మావోయిస్టులు మరణించినట్లు అధికారులు తెలిపారు.
Jharkhand Encounter | కీలక నేతలు..
జార్ఖండ్ ఐజీ (ఆపరేషన్స) మైఖేల్ రాజ్, కొల్హాన్ డీఐజీ అనురంజన్ కిస్ఫోటా మాట్లాడుతూ.. ఎన్కౌంటర్లో కీలక నేతలు హతమైనట్లు తెలిపారు. అయితే ఇంకా ఆపరేషన్ కొనసాగుతోందన్నారు. ఆపరేషన్ ముగిసిన తర్వాత మరణాల సంఖ్యను నిర్ధారించవచ్చు అన్నారు. కోబ్రా దళాలు, రాష్ట్ర పోలీసులు (State Police) గురువారం ఉదయం అటవీ ప్రాంతంలో కూంబింగ్ (Coombing) చేపట్టినట్లు తెలిపారు. ఈ క్రమంలో పాటిరామ్ మాఝి అలియాస్ అనల్-డా, లాల్‌చంద్ హెంబ్రామ్ అలియాస్ అన్మోల్ నేతృత్వంలోని మావోయిస్టు బృందాలు కుంబ్దిహ్ గ్రామం (Kumbdih Village) సమీపంలో వారిపై కాల్పులు జరిపాయన్నారు. అనంతరం పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో పది మంది చనిపోయారు. వారిలో రూ.50 లక్షల రివార్డు ఉన్న నేత సైతం ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతోంది. భారీగా బలగాలను అక్కడికి తరలించారు.