Homeబిజినెస్​Om Freight Forwarders IPO | అదరగొట్టిన ఐపీవో.. తొలిరోజే సంపద డబుల్‌.. నిరాశ పరిచిన...

Om Freight Forwarders IPO | అదరగొట్టిన ఐపీవో.. తొలిరోజే సంపద డబుల్‌.. నిరాశ పరిచిన ఓం ఫ్రైట్‌ ఫార్వర్డర్స్‌

Om Freight Forwarders IPO | దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో బుధవారం పది కంపెనీలు లిస్టయ్యాయి. రెండు కంపెనీలు భారీ లాభాలను ఇవ్వగా.. మరో రెండు కంపెనీలు ఇన్వెస్టర్లను నిరాశ పరిచాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Om Freight Forwarders IPO | దేశీయ స్టాక్‌ మార్కెట్‌(Domestic Stock Market)లో బుధవారం పది కంపెనీలు లిస్టయ్యాయి. ఇందులో రెండు కంపెనీలు భారీ లాభాలను ఇవ్వగా.. మరో రెండు కంపెనీలు ఇన్వెస్టర్లను నిండా ముంచాయి. మిగిలిన కంపెనీలు పరవాలేదనిపించాయి.

దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో ఐపీవో(IPO)ల సందడి కొనసాగుతోంది. బుధవారం పది కంపెనీల షేర్లు ట్రేడిరగ్‌ ప్రారంభించాయి. ఇందులో రెండు మెయిన్‌బోర్డ్‌(Mainboard) ఐపీవోలు కాగా.. మిగిలినవి ఎస్‌ఎంఈ(SME) సెగ్మెంట్‌కు చెందినవి. మెయిన్‌బోర్డ్‌కు చెందిన ఓం ఫ్రైట్‌ ఫార్వర్డర్స్‌ కంపెనీ ఇన్వెస్టర్లను పూర్తిగా నిరాశపరిచింది. ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌కు చెందిన ఇన్ఫినిటీ ఇన్ఫోవే తొలిరోజే 90 శాతం లాభాలను అందించడం గమనార్హం. షీల్‌ బయోటెక్‌ ఎస్‌ఎంఈ 44.44 శాతం లాభాలను అందించింది. మిగిలిన కంపెనీలలో ఒక ఎస్‌ఎంఈ ఐపీవో మినహా మిగిలినవి ఓ మోస్తరు లాభాలను ఇచ్చాయి.

అదరగొట్టిన ఇన్ఫినిటీ ఇన్ఫోవే..

బీఎస్‌ఈ ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌కు చెందిన ఇన్ఫినిటీ ఇన్ఫోవే(Infinity Infoway) ఐపీవో సైజ్‌ రూ. 23.19 కోట్లు. జీఎంపీ బాగుండడం, చిన్న ఐపీవో కావడంతో 277 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ (Over subscribe)అయ్యింది. ఈ కంపెనీ షేర్లు బుధవారం లిస్టయ్యాయి. ఒక్కో ఈక్విటీ షేరు ధర రూ. 155 కాగా.. 90 శాతం ప్రీమియంతో రూ. 294.50 వద్ద లిస్టయ్యింది. ఆ తర్వాత మరో 10 శాతం పెరిగి రూ. 309.20 వద్ద అప్పర్‌ సర్క్యూట్‌(Upper circuit) తాకింది. అంటే ఐపీవో అలాట్‌ అయినవారి సంపద తొలిరోజే డబుల్‌ అయ్యిందన్న మాట. ఈ ఐపీవోలో రూ. 2.48 లక్షలు ఇన్వెస్ట్‌ చేయగా.. తొలిరోజే రూ. 246 లక్షల లాభం వచ్చింది.

నిరాశపరిచిన ఓం ఫ్రైట్‌ ఫార్వర్డర్స్‌..

మార్కెట్‌నుంచి రూ. 122.31 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఐపీవోకు వచ్చిన ఓం ఫ్రైట్‌ ఫార్వర్డర్స్‌(Om Freight Forwarders) మెయిన్‌బోర్డ్‌ కంపెనీ.. గతనెల 29 నుంచి ఈనెల 1వ తేదీ వరకు సబ్‌స్క్రిప్షన్‌ స్వీకరించింది. ఈ కంపెనీ షేర్లు బుధవారం బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టయ్యాయి. గరిష్ట ప్రైస్‌బ్యాండ్‌ వద్ద ఒక్కో ఈక్విటీ షేరు ధర రూ. 135 కాగా.. రూ. 81.50 వద్ద లిస్టయ్యింది. అంటే ఐపీవో ఇన్వెస్టర్లకు లిస్టింగ్‌ సమయంలో 39.63 శాతం నష్టాలను అందించిందన్న మాట. అయితే వెంటనే 5 శాతం పెరిగి రూ. 85.57 వద్ద అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది.

అడ్వాన్స్‌ ఆగ్రో లైఫ్‌..

మెయిన్‌బోర్డ్‌కు చెందిన అడ్వాన్స్‌ ఆగ్రో లైఫ్‌(Advance Agrolife) కంపెనీ రూ. 192.86 కోట్లు సమీకరించడం కోసం ఐపీవోకు వచ్చింది. ఒక్కో ఈక్విటీ షేరు ధర రూ. 100 కాగా.. రూ. 114 వద్ద లిస్టయ్యింది. ఐపీవో అలాట్‌ అయినవారికి లిస్టింగ్‌ సమయంలోనే 14 శాతం లాభాలను ఇచ్చింది. అయితే లిస్టయిన తర్వాత షేరు ధర పడిపోయింది. రూ. 108.30 వద్ద లోయర్‌ సర్క్యూట్‌(Lower circuit) కొట్టింది.

44 శాతం ప్రీమియంతో షీల్‌ బయోటెక్‌..

షీల్‌ బయోటెక్‌(Sheel Biotech) ఎన్‌ఎస్‌ఈ ఎస్‌ఎంఈ కంపెనీ ఐపీవో ద్వారా రూ. 32.31 కోట్లు సమీకరించింది. గరిష్ట ప్రైస్‌ బ్యాండ్‌ వద్ద ఒక్కో ఈక్విటీ షేరు ధర రూ. 63 కాగా.. బుధవారం 44.44 శాతం ప్రీమియంతో రూ. 91 వద్ద లిస్టయ్యింది. తర్వాత మరింత పెరిగి రూ. 95.55 వద్ద అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. అంటే తొలిరోజు ఇన్వెస్టర్లకు 51.67 శాతం లాభాలను అందించింది.

20 శాతం డిస్కౌంట్‌తో..

చిరాహరిట్‌(Chiraharit) బీఎస్‌ఈ ఎస్‌ఎంఈ ఐపీవో ఇన్వెస్టర్లకు నష్టాలను మిగిల్చింది. ఈ కంపెనీ 20 శాతం డిస్కౌంట్‌తో లిస్టయ్యింది.

ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌లో…

  • బీఏజీ కన్వర్జెన్స్‌(B.A.G.Convergence) షేర్లు బీఎస్‌ఈలో లిస్టయ్యాయి. 16.09 శాతం లాభాలను అందించాయి.
  • జీలియో ఈ మొబిలిటీ(Zelio E-Mobility) బీఎస్‌ఈ ఎస్‌ఎంఈ ఐపీవో బుధవారం లిస్టయ్యింది. ఈ కంపెనీ షేర్లు ఐపీవో ఇన్వెస్టర్లకు 13.9 శాతం లాభాలను ఇచ్చాయి.
  • నస్‌స్కై లాజిస్టిక్స్‌(Sunsky Logistics) కంపెనీ షేర్లు 10.87 శాతం ప్రీమియంతో బీఎస్‌ఈలో లిస్టయ్యాయి.
  • మ్యూనిష్‌ ఫోర్జ్‌(Munish Forge) ఎన్‌ఎస్‌ఈ ఎస్‌ఎంఈ కంపెనీ షేర్లు 9.38 శాతం లాభాలు ఇచ్చాయి.
  • వాల్‌ప్లాస్ట్‌ టెక్నాలజీస్‌(Valplast Technologies) బీఎస్‌ఈ ఎస్‌ఎంఈ ఐపీవో 5.56 శాత ప్రీమియంతో వద్ద లిస్టయ్యింది.