అక్షరటుడే, ఆర్మూర్: Nandipet Bus Depot | నందిపేట్‌లో బస్‌డిపో ఏర్పాటు చేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను (Minister Ponnam) ఆర్మూర్ నియోజకవర్గ (Armoor Constituency) ఇన్‌ఛార్జి వినయ్‌రెడ్డి కోరారు. హైదరాబాద్‌లోని (Hyderabad) ఆయన స్వగృహంలో కలిసి బస్ డిపో ఏర్పాటు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
Nandipet Bus Depot | కొన్నేళ్లుగా ప్రజల ఎదురుచూపులు..
కొన్నేళ్లుగా నందిపేట్, చుట్టు పక్కల మండలాల ప్రజలు బస్‌డిపో ఏర్పాటు కోసం ఎదురు చూస్తున్నారని వినయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. బస్‌డిపో ఏర్పాటుతో రవాణా సౌకర్యం మరింత మెరుగవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఆర్మూర్ పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో సమస్యలను సైతం మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ రెండు సమస్యలను పరిష్కరిస్తానని మంత్రి పొన్నం హామీ ఇచ్చారని వినయ్ రెడ్డి పేర్కొన్నారు.
Minister Ponnam Prabhakar | అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు : మంత్రి పొన్నం ప్రభాకర్