అక్షరటుడే, వెబ్‌డెస్క్: Realme P4 Power 5G | స్మార్ట్ ఫోన్ (Smart Phone) మార్కెట్‌లో బిగ్ బ్యాటరీల ట్రెండ్ నడుస్తోంది. దాదాపు అన్ని కంపెనీలు 7000 ఎంఏహెచ్ ఆపై సామర్థ్యం గల బ్యాటరీలతో ఫోన్‌లను తీసుకువస్తున్నాయి. ప్రస్తుతం వన్‌ప్లస్ 15ఆర్ మోడల్ 7400 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంలో దేశంలో అత్యధిక సామర్థ్యం గల స్మార్ట్‌ఫోన్‌గా ఉంది.
అయితే చైనా (China)కు చెందిన రియల్‌మీ మరింత సామర్థ్యం గల బ్యాటరీతో నూతన మోడల్‌ను తీసుకువస్తోంది. ఏకంగా 10,001 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం గల రియల్‌మీ పీ4 పవర్ మోడల్‌ను రిలీజ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇది ఈనెల 29న విడుదలకానుంది. ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండనుంది. ధర, ఇతర వివరాలు లాంచింగ్ తర్వాత తెలియనున్నాయి. ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలలో అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఈ మోడల్ స్పెసిఫికేషన్స్ ఇలా ఉండే అవకాశాలు ఉన్నాయి.
డిస్‌ప్లే : 6.78 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తున్న ఈ ఫోన్.. 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, ఐపీ68, ఐపీ69 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది.
బ్యాటరీ సామర్థ్యం : 10,001 ఎంఏహెచ్ శక్తిమంతమైన బ్యాటరీ అమర్చారు. ఇది 80డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. 3 శాతం బ్యాటరీ ఉన్నా గంటా 52 నిమిషాలపాటు ఫోన్‌ను ఉపయోగించవచ్చని కంపెనీ చెబుతోంది. సింగిల్ ఛార్జ్‌తో 32.5 గంటల వీడియో ప్లేబ్యాక్ పొందవచ్చని, ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఫోన్‌లో ఎలాంటి యాక్టివిటీ లేకపోతే 31 రోజుల వరకు ఆన్‌లోనే ఉంటుందని పేర్కొంటోంది.
సాఫ్ట్‌వేర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా చిప్ ప్రాసెసర్‌తో తీసుకువస్తున్నారు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్‌మీ యూఐ 7.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. మూడేళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, నాలుగేళ్లపాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇవ్వనున్నారు.
కెమెరా సెటప్ : వెనకవైపు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్ ఉండనున్నాయి. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది.
వేరియంట్స్ : ట్రాన్స్ ఆరెంజ్, ట్రాన్స్‌బ్లూ, ట్రాన్స్‌సిల్వర్ రంగుల్లో లభిస్తుంది.
బేస్ వేరియంట్ ధర రూ.30 వేలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.37,999 గా ఉండొచ్చని భావిస్తున్నారు.