అక్షరటుడే, ఆర్మూర్: Alur | ఆలూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి దారుణంగా హతమార్చారు. సీఐ సత్యనారాయణ గౌడ్ (CI Satyanarayana Goud) తెలిపిన వివరాల ప్రకారం.. ఆలూర్ మండల కేంద్రంలో అర్ధరాత్రి గొల్ల పెద్దగంగారాం ఇంటిబయట నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి హతమార్చారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి (Armoor Government Hospital) తరలించారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదని.. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు సీఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. మండల కేంద్రంలో అర్ధరాత్రివేళ హత్య జరగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
