అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad | హైదరాబాద్ పాతబస్తీలోని ఛత్రినాక పోలీస్ స్టేషన్ (Chatrinaka Police Station) పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. శంషీర్‌గంజ్ (Shamshirganj)లోని ఓ వైన్ షాప్ వద్ద అందరు చూస్తుండగా ఓ వ్యక్తిని హత్య చేశారు.
ఓ వైన్ షాప్ ఎదుట శనివారం రాత్రి ఛత్రినాకకు చెందిన సతీష్ అనే యువకుడిపై దుండగులు దాడి చేశారు. అందరు చూస్తుండగా నడిరోడ్డుపై వేట కొడవళ్లతో నరికి చంపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా (Social Media)లో వైరలవుతోంది. అనంతరం నిందితులు పారిపోయారు. అయితే హత్యకు గల కారణాలు తెలియరాలేదు.
Hyderabad | నిందితుల కోసం వేట
హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. అయితే రోడ్డుపై ఓ వ్యక్తిని హత్య చేస్తున్న ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. కొందరు ఫోన్లలో వీడియో తీయడం గమనార్హం.
Hyderabad | నగరంలో పెరిగిన హత్యలు
హైదరాబాద్ నగరంలో ఇటీవల హత్యలు పెరిగాయి. ముఖ్యంగా నడి రోడ్డుపై అందరు చూస్తుండగా కొందరు దాడులకు పాల్పడుతున్నారు. పాత కక్షలు, ప్రేమ వ్యవహారాలు, డబ్బు తదితర కారణాలతో ఎక్కువగా హత్యలు జరుగుతున్నాయి. పాత నేరస్తుల్లో ఎక్కువగా ఇలాంటి హత్యలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో సీపీ సజ్జనార్ (CP Sajjanar) ఇటీవల రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు. అయినా హత్యలు మాత్రం ఆగడం లేదు.