అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Traffic Jam | హైదరాబాద్ – విజయవాడ హైవేపై లారీ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం (Abdullapurmet Mandal) ఇనాంగూడ కట్టెల లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడింది.
రోడ్డుపై చెల్లాచెదురుగా కట్టెలు పడిపోయాయి. దీంతో ఎన్‌హెచ్–65పై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు 6 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అసలే సంక్రాంతి పండుగ (Sankranti Festival) కావడంతో భారీగా వాహనాలు విజయవాడ వైపు వెళ్తున్నాయి. ఈ క్రమంలో ప్రమాదం జరిగి ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కట్టెలను రోడ్డుపై నుంచి తొలగించారు. జేసీబీల సాయంతో కట్టెలు, లారీని పక్కకు తప్పించారు. అనంతరం ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు.