అక్షరటుడే, వెబ్డెస్క్ : Nagarkurnool | నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. ఓ లారీ ఆర్టీసీ బస్సు, బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.
కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం (Veldanda Mandal) పెద్దాపూర్ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, బైక్ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, బస్సులోని 9 మందికి గాయాలు అయ్యాయి. మృతుడు హైదరాబాద్ (Hyderabad)లోని HDFC బ్యాంక్లో పని చేస్తున్న రాజుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా ఈ ఘటనలో బస్సు తీవ్రంగా ధ్వంసమైంది.
Nagarkurnool | ఖమ్మం జిల్లాలో..
ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవేపై రెండు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. తల్లాడ మండలం పాత పినపాక వద్ద వాటర్ ట్యాంకర్ను కారు ఢీకొంది. వైరా మండలం సోమవరం వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనల్లో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా.. ఆరుగురు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. పొగ మంచు వల్లే రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు సమాచారం. కాగా పండుగ పూట వరుస ప్రమాదాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.