అక్షరటుడే, ఎల్లారెడ్డి : Chirutha | నాగిరెడ్డిపేట మండలంలో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. తాండూర్ గేట్ సమీపంలోని ధర్మారెడ్డి బీట్ అటవీ ప్రాంతంలో (Dharmareddy Beat Forest Area) చిరుత సంచరిస్తుందన్న సమాచారంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
Chirutha | ధర్మారెడ్డి అటవీ ప్రాంతంలో..
తాండూర్ గేట్ (Tandur Gate) సమీపంలోని ధర్మారెడ్డి అటవీ ప్రాంతంలో ప్రధాన రహదారి దాటుతూ శనివారం ఉదయం11 గంటలకు స్థానికులకు చిరుత కనిపించింది. దీంతో ఈ విషయాన్ని స్థానికులు నాగిరెడ్డిపేట మండల (Nagireddypeta Mandal) అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ రేంజ్ అధికారి వాసుదేవ్ తన రేంజ్ సిబ్బందితో కలిసి తాండూర్ గేట్ సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లి చిరుత ఆచూకీపై తనిఖీ చేశారు. అక్కడ చిరుతపులి (Leopard) పాద ముద్రలు, స్కాట్స్ (విసర్జీతం) గుర్తించినట్లు ఎఫ్ఆర్వో వాసుదేవ్ తెలిపారు.
Chirutha | జాగ్రత్తగా ఉండాలి..
ధర్మారెడ్డి అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లుగా నిర్ధారణ జరిగినందున అడవి సమీపంలోని తాండూర్, ధర్మారెడ్డి, బంజార తండా, లింగంపల్లి కలాన్ గ్రామ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు. రైతులు సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఒంటరిగా పొలాల వద్దకు వెళ్లవద్దని సూచించారు. తనిఖీల్లో డీఆర్వో రవికుమార్, బీట్ అధికారి నవీన్ బేస్ క్యాంప్ సిబ్బంది గోపాల్ పాల్గొన్నారు.