100
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad city | నగర శివారులో యథేచ్ఛగా మొరం అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం మొరం తవ్వుతున్న జేసీబీని పోలీసులు సీజ్ చేశారు.
ఐదో టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో..
ఐదో టౌన్ పరిధిలోని (5th town police) నాగారంలో గల (Nagaram) ఓం గుట్ట వద్ద మొరం అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయనే ఫిర్యాదు మేరకు పోలీసులు దాడులు జరిపారు. ఈ సందర్భంగా మొరం తవ్వుతున్న జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో మొరం తవ్వకాలు చేసిన వారికోసం గాలిస్తున్నట్లు ఐదో టౌన్ ఇన్ఛార్జి ఎస్సై లక్ష్మణ్ తెలిపారు. జేసీబీ డ్రైవర్ పరారీలో ఉన్నాడని.. అతడి కోసం గాలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.