అక్షరటుడే,మెండోరా : Arrive Alive | హెల్మెట్ బరువు కాదు బాధ్యతగా భావించాలని ఆర్మూర్ రూరల్ సీఐ జాన్‌రెడ్డి (CI John Reddy) అన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై మెండోరా మండలంలో ఎస్సై సుహాసిని (SI Suhasini) ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
Arrive Alive | దూదిగాం వద్ద జాతీయ రహదారిపై..
మండలంలోని దూదిగాం సమీపంలోని ఎన్‌హెచ్ 44 రహదారిపై బ్లాక్ స్పాట్‌గా గుర్తించిన కోతి దేవుని వద్ద అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ రూరల్ సీఐ జాన్ రెడ్డి మాట్లాడుతూ.. రోడ్డు భద్రత నియమాలపై వాహనదారులకు అవగాహన కల్పించారు. అలాగే రోడ్డు ప్రమాదాల్లో (Road Accidents) తమ ఆత్మీయులను కోల్పోయిన బాధితులతో మాట్లాడి, వారి అనుభవాలను విన్నారు. ఈ సందర్భంగా పోచంపాడ్ గ్రామానికి (Pochampad Village) చెందిన మహమ్మద్ జహంగీర్ మాట్లాడుతూ.. గత మూడు నెలల క్రితం తన కుమారుడు హెల్మెట్ ధరించకుండా బైక్ నడుపుతూ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. హెల్మెట్ ధరించకపోవడమే తన కుమారుడి ప్రాణాలు తీసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఐ జాన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి వాహనదారుడు వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించి, వేగ నియంత్రణ పాటిస్తూ వెళ్లాలన్నారు. మద్యం సేవించి వాహనం నడపకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రోడ్డు భద్రత నియమాలు పాటించడమే ప్రాణరక్షణకు మార్గమని తెలిపారు. కార్యక్రమంలో నూతన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, వాహనదారులు పాల్గొన్నారు.