అక్షరటుడే, ఆర్మూర్ : Alumni Reunion | మండలంలోని అంకాపూర్(Ankapur) ఉన్నత పాఠశాల 2007-08 పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పాఠశాల ఆవరణలో ఆదివారం ఘనంగా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా నాడు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు వింజామ వెంకట నరసయ్య, పసుపుల సుదర్శన్, దొండి శ్యామల, శారద, అతిక్లను ఘనంగా సన్మానించారు. 17ఏళ్ల తర్వాత ఒకచోట చేరిన నాటి విద్యార్థులు పాఠశాలలో తమ అనుభవాలను జ్ఞాపకాలను పంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు వీరేందర్, వెంకట్, ఆశీర్వాదం, కృష్ణయ్య, సతీష్ సద్దాం, జలీల్, జ్ఞానేశ్వర్, సౌజన్య, నిరోషా, అశ్విని, రేణుక, లావణ్య, శ్యామల, సత్య గంగు, బాలామణి తదితరులు పాల్గొన్నారు.