అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Goods Train | గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున ఏపీలో చోటు చేసుకుంది.
ఒక గూడ్స్ రైలుకు చెందిన మూడు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు (Nellore) జిల్లాలో ఉన్న కావలి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు మార్గం దెబ్బతింది. పాలు ట్యాంకర్లను తీసుకువెళ్తున్న ఈ గూడ్స్ రైలు నిజాముద్దీన్ నుంచి రేణిగుంట (Renigunta)కు ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో పట్టాలు తప్పింది. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. విజయవాడ (Vijayawada), రేణిగుంట మధ్య రైలు మార్గాన్ని సాధారణ స్థితికి తీసుకురావడానికి రైల్వే అధికారులు వెంటనే పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. కాగా సమయంలో ఇతర రైళ్లు రాకపోవడంతో ప్రమాదం తప్పింది.
Goods Train | రైళ్ల రాకపోకలకు అంతరాయం
రైలు పట్టాలు తప్పడంతో రైల్వే ట్రాక్ దెబ్బతింది. దీంతో రైల్వే అధికారులు మరమ్మతులు చేపడుతున్నారు. ఈ కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో పండుగ పూట ఊళ్లకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. కాగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ కదులుతున్న గూడ్స్ రైలు బోగీలు విడిపోయిన విషయం తెలిసిందే. అనంతపురం జిల్లా రాయదుర్గం రైల్వే స్టేషన్ (Rayadurgam Railway Station) సమీపంలో గురువారం ఉదయం గూడ్స్ రైలు బోగీలు విడిపోయాయి. ఇనుప ఖనిజం లోడ్‌తో గూడ్స్ రైలు కర్ణాటకలోని మంగళూరుకు వెళ్తుండగా ఈ ఘటన చోట చేసుకుంది.