అక్షరటుడే, వెబ్‌డెస్క్ : MP Arvind | కేటీఆర్ (KTR)పై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనపై డ్రగ్స్ కేసు పెట్టాలన్నారు. జగిత్యాల (Jagtial)లోని ఓ హోటల్లో మీడియాతో మాట్లాడారు.
డ్రగ్స్ తీసుకునే వారికి ఎలాంటి క్యారెక్టర్ ఉంటుందో కేటీఆర్‌ది అదే క్యారెక్టర్ అని అర్వింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌పై డ్రగ్స్ పెడ్లర్, డ్రగ్స్ ప్రమోటర్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) జరిగిందన్నారు. దీనికి అనేక ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ట్యాపింగ్‌కు పాల్పడిన వారిని అరెస్ట్ చేస్తారా లేదా అనేది సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. రేవంత్ రెడ్డి ప్యాకేజీకి అమ్ముడుపోతారా? లేక నిజాయితీగా పనిచేస్తారా అన్నది చూడాలని పేర్కొన్నారు.
MP Arvind | జీవన్‌రెడ్డిని హింసిస్తున్న కాంగ్రెస్
జగిత్యాల రాజకీయాలపై అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఏ పార్టీలో ఉన్నారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (Jeevan Reddy)పై కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు సరికాదని ఆయన తెలిపారు. ఈ వయసులో ఆయనను హింసించడం మహా పాపం అన్నారు. ఎలక్షన్ టైం కాకపోతే జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించేవాడినని చెప్పారు. ఆయనను మానసిక క్షోభకు గురిచేయడం కాంగ్రెస్‌కు మంచిది కాదన్నారు. కాగా జగిత్యాలలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన సంజయ్ కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఆయనన చేరికను జీవన్‌రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో జగిత్యాల కాంగ్రెస్‌లో వర్గపోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా అర్వింద్ వ్యాఖ్యలు చేశారు.