అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market | ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు, ఎఫ్‌ఐఐల నిరంతర అమ్మకాలు, రూపాయి విలువలో బలహీనత తదితర కారణాలతో మార్కెట్‌పై ఒత్తిడి నెలకొంది. యూఎస్ ప్రెసిడెంట్ విధించిన రెసిప్రోకల్ టారిఫ్స్ విషయంలో అక్కడి సుప్రీంకోర్టు (Supreme Court) ఈరోజు తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
సెన్సెక్స్ డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్‌పైరీ కూడా కావడంతో స్టాక్ మార్కెట్ (stock market) తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతూ సాగింది. బుధవారం ఉదయం సెన్సెక్స్ (Sensex) 269 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 84 పాయింట్ల నష్టంతో ప్రారంభమయ్యాయి. సూచీలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటూ లాభనష్టాల మధ్య ఊగిసలాడుతూ సాగాయి. చివరికి సెన్సెక్స్ 244 పాయింట్ల నష్టంతో 83,382 వద్ద, నిఫ్టీ 67 పాయింట్ల నష్టంతో 25,665 వద్ద స్థిరపడ్డాయి.
Stock Market | మెటల్, పీఎస్‌యూ బ్యాంక్స్‌లో జోరు..
బీఎస్‌ఈలో మెటల్ ఇండెక్స్ 2.67 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ 2.43 శాతం, కమోడిటీ 1.59 శాతం, పీఎస్‌యూ 1.14 శాతం, ఇన్‌ఫ్రా 0.67 శాతం, ఎనర్జీ 0.64 శాతం లాభపడగా.. ఐటీ 1.30 శాతం, రియాలిటీ ఇండెక్స్ 0.98 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 0.96 శాతం, ఆటో 0.62 శాతం, ఎఫ్‌ఎంసీజీ 0.53 శాతం నష్టపోయాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.25 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.16 శాతం లాభపడగా.. లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.07 శాతం నష్టపోయింది.
Stock Market | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్‌ఈలో నమోదైన కంపెనీలలో 2,017 కంపెనీలు లాభపడగా 2,150 స్టాక్స్ నష్టపోయాయి. 177 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 88 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 222 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 12 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 11 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
Stock Market | Top gainers..
బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో (BSE Sensex) 12 కంపెనీలు లాభపడగా.. 18 కంపెనీలు నష్టపోయాయి. టాటా స్టీల్ 3.70 శాతం, ఎన్టీపీసీ 3.21 శాతం, యాక్సిస్ బ్యాంక్ 2.98 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 1.65 శాతం, ఎటర్నల్ 1.60 శాతం లాభపడ్డాయి.
Stock Market | Top losers..
టీసీఎస్ 2.30 శాతం, ఆసియన్ పెయింట్ 2.29 శాతం, మారుతి 1.77 శాతం, సన్‌ఫర్మా 1.64 శాతం, హెచ్‌యూఎల్ 1.54 శాతం నష్టపోయాయి.