అక్షరటుడే, వెబ్డెస్క్ : Cabinet Meeting | మేడారం (Medaram)లో మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy)అధ్యక్షతన రెండున్నర గంటలుగా భేటీ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు.
రాష్ట్ర చరిత్రలో తొలిసారి హైదరాబాద్ (Hyderabad) బయట మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో 18 అంశాలపై చర్చించాలని నిర్ణయించారు. ఇప్పటికే 12 అంశాలపై చర్చ పూర్తవ్వగా మరో 6 అంశాలపై సమావేశం కొనసాగుతోంది. ఇందులో భాగంగా మున్సిపల్ ఎన్నికల (Municipal Elections)పై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జిల్లాల పునర్వవస్థీకరణ కోసం రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పొట్లపాడు ఎత్తిపోతల పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే మేడారంలో శాశ్వత భవనాల నిర్మాణానికి ఓకే చెప్పింది.
Cabinet Meeting | భారీ భద్రత
మేడారం హరిత హోటల్లో మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. కేబినెట్ మీటింగ్ నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. సమావేశానికి ముందు సీఎం రేవంత్రెడ్డి మేడారంలోని అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆయన వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ తదితరులు ఉన్నారు. మంత్రులతో కలిసి బస్సులో జంపన్న వాగు సర్కిల్ వరకు ప్రయాణించారు. మేడారం జాతర కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. భక్తుల కోసం కల్పించిన వివిధ సౌకర్యాలను సమీక్షించారు. మేడారం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. జాతరకు హాజరయ్యే భక్తుల సౌకర్యం, భద్రత కోసం పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.