అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Talasani Srinivas Yadav | మాజీ మంత్రి, సనత్‌నగర్ (Sanath Nagar) ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌పై కేసు నమోదు అయింది. సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పోలీసులు కేసు పెట్టారు.
సికింద్రాబాద్ (Secunderabad)ను విభజించే కుట్ర జరుగుతోందని ఇటీవల తలసాని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మాట్లాడుతూ.. ‘‘సికింద్రాబాద్‌ను ముక్కలు చేస్తే.. నిన్ను ముక్కలు చేస్తాం’ అంటూ సీఎంను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం ఆయన తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పారు. ఈ క్రమంలో సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ నేత రవి కిరణ్ తలసానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Talasani Srinivas Yadav | దర్యాప్తు చేస్తున్న పోలీసులు
సికింద్రాబాద్‌లో జరిగిన ఓ మీడియా సమావేశంలో ముఖ్యమంత్రిని ఉద్దేశించి తలసాని వ్యాఖ్యలు చేసినట్టు రవి కిరణ్ పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన ఎస్ఆర్ నగర్ పోలీసులు (SR Nagar Police) దర్యాప్తు చేస్తున్నారు. కాగా సీఎంపై తలసాని వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు ఖండించారు. అయితే తాను ఆవేశంలో అలా మాట్లాడినట్లు ఇప్పటికే తలసాని వివరణ ఇచ్చారు. రాజ్యాంగబద్ద పదవుల్లో ఉన్న వ్యక్తులను తాను గౌరవిస్తానని చెప్పారు. మరి ఈ కేసులో పోలీసులు ఎలా ముందుకు వెళ్తారో చూడాలి. కాగా సికింద్రాబాద్ పరిధిలోని ప్రాంతాలను మల్కాజ్గిరి కమిషనరేట్‌లో కలపడంపై తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి వ్యతిరేకంగా ఈ నెల 17న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించనున్నారు.