అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nirmal Accident | నిర్మల్ జిల్లా భైంసా దగ్గర మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. కంటైనర్‌ను కారు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు.
సత్‌పూల్ బ్రిడ్జి (Satpul Bridge) దగ్గర కంటైనర్‌ను వెనకనుంచి వస్తోన్న కారు ఢీకొంది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు అయింది. కారు డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు స్పాట్లోనే చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను కుబీర్ మండలం (Kubir Mandal) కుప్టి గ్రామానికి చెందిన భోజరం పటేల్42, రాజన్న(60), బాబన్న (70), వికాస్‌గా గుర్తించారు. వీళ్లు హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న బంధువులను పరామర్శించి వస్తుండగా ప్రమాదం జరిగింది.
Nirmal Accident | ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా
కొత్తగూడెం జిల్లా (Kothagudem District) దమ్మపేట (మండలం) గట్టుగూడెం వద్ద కేవీఆర్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. బ్రేక్ ఫెయిల్ కావడంతో బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. పలువురు గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగారులను పోలీసుల వాహనాలు, అంబులెన్సుల్లో ఆస్పత్రికి తరలించారు. కాగా ఇటీవల బస్సు ప్రమాదాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రైవేట్, ఆర్టీసీ బస్సు ప్రమాదాలు ఇటీవల కాలంలో తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఎక్కువ శాతం ప్రమాదాలు అర్ధరాత్రి, తెల్లవారుజామున జరుగుతున్నాయి.