Medaram Jathara | 18న మేడారంలో మంత్రివర్గ సమావేశం: మంత్రి పొంగులేటి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Medaram Jathara | మేడారంలో ఈ నెల 18న సీఎం రేవంత్​రెడ్డి ఆధ్వర్యంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) తెలిపారు. తొలిసారిగా రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేలా క్యాబినెట్ మీటింగ్ (cabinet meeting) నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మేడారం మహా జాతరను (Medaram Maha Jatara) ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ మేరకు అభివృద్ధి పనులు చేపట్టింది. సమ్మక్క, సారలమ్మ గద్దెలను పునర్​ నిర్మించింది. […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Medaram Jathara | మేడారంలో ఈ నెల 18న సీఎం రేవంత్​రెడ్డి ఆధ్వర్యంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) తెలిపారు. తొలిసారిగా రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేలా క్యాబినెట్ మీటింగ్ (cabinet meeting) నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం మేడారం మహా జాతరను (Medaram Maha Jatara) ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ మేరకు అభివృద్ధి పనులు చేపట్టింది. సమ్మక్క, సారలమ్మ గద్దెలను పునర్​ నిర్మించింది. ఆయా పనులను ప్రారంభించడానికి సీఎం రేవంత్​రెడ్డి ఈ నెల 18న మేడారం వెళ్లనున్నారు. అక్కడ మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తారు. రాత్రి అక్కడే బస చేసి 19న అమ్మవారి గద్దెలను సీఎం ప్రారంభిస్తారు. పొంగులేటి మాట్లాడుతూ.. సమ్మక్క-సారలమ్మ జాతరను కుంభమేళా కంటే అద్భుతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు. మేడారంలో కాకతీయుల నాటి వైభవం ఉట్టిపడేలా నిర్మించిన రాతి కట్టడాలను 19వ తేదీ ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు.

Medaram Jathara | పాలేరులో పర్యటన

పాలేరు నియోజకవర్గంలో రూ.362 కోట్లతో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ఈ నెల 18న శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. సీఎం పర్యటన నేపథ్యంలో శుక్రవారం ఆయన అధికారులతో కలిసి సభాస్థలి ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం మద్దులపల్లిలో జేఎన్టీయూ కళాశాలకు శంకుస్థాపన, నర్సింగ్ కళాశాల ప్రారంభోత్సవం చేయడంతో పాటు.. మున్నేరు-పాలేరు లింక్ కెనాల్ నిర్మాణ పనులను ప్రారంభిస్తారని తెలిపారు. మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్​ను ప్రారంభిస్తారని చెప్పారు. కూసుమంచిలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని తెలిపారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...