అక్షరటుడే, ఇందూరు: Nishitha Degree College | శ్రద్ధతో చదివితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకృష్ణా రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని నిషిత డిగ్రీ కళాశాల (Nishita Degree College) మొదటి కాన్వకేషన్ బుధవారం నిర్వహించారు.
Nishitha Degree College | ఎందరో విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దుతూ..
బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా జిల్లాలో విద్యను (education) అందిస్తున్న నిషిత డిగ్రీ కళాశాల అటానమస్ హోదా పొందడం అభినందనీయమన్నారు. ఎందరో విద్యార్థులకు విద్యాబుద్ధులను అందించి ఉత్తమంగా తీర్చిదిద్దారన్నారు. అధ్యాపకులు మరింత కృషిచేసి విద్యార్థుల అభివృద్ధికి తోడ్పడాలన్నారు. న్యాక్ ఏ గ్రేడ్‌తో (NAAC ‘A’ grade) ముందుకు సాగుతుందని, భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Nishitha Degree College | ఉత్తమ విద్యార్థులకు సన్మానం
అనంతరం డిగ్రీ పీజీలో ఉత్తమ విద్యార్థులను సన్మానించారు. పీజీలో టాపర్‌గా నిలిచిన విద్యార్థికి భూమయ్య అవార్డును అందజేసి రెండేళ్ల ఫీజును అందజేశారు. అలాగే డిగ్రీలో ఉత్తమంగా రాణించిన విద్యార్థులకు గోల్డ్, సిల్వర్ మెడల్స్ అందించారు. కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ యాదగిరిరావు, కళాశాల ప్యాట్రన్ వినయ్ కుమార్, ఛైర్మన్ నిఖిల్, కోఆర్డినేటర్ రాజు, అకాడమిక్ అడ్వైజర్ సాయిలు, డైరెక్టర్ షేక్, ప్రిన్సిపాల్ స్వప్న తదితరులు పాల్గొన్నారు.
