అక్షరటుడే ఎల్లారెడ్డి : Nizam Sagar | రోడ్డు ప్రమాదం (Road Accident)లో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన నిజాంసాగర్ మండలం పిట్లం రోడ్డుపై ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.
నిజాంసాగర్ పిట్లం మండలం (Pitlam Mandal) మాగి గ్రామానికి చెందిన నగేష్ గాయత్రి షుగర్ ఫ్యాక్టరీలో (Gayatri Sugar Factory) పనిచేసేవాడు. ఆదివారం రాత్రివేళ దర్గా సమీపంలో బైక్పై వెళ్తూ అదుపుతప్పి కింద పడ్డాడు. ఈ ఘటనలో నగేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. నగేష్ రాత్రికి ఇంటికి రాకపోవడంతో బంధువు వెతుకుతుండగా.. దర్గా సమీపంలోని మూలమలుపు వద్ద రోడ్డు పక్కన మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.