Oscar Awards 2026 | ఈ సారి భార‌తీయుల‌కి నిరాశే.. ఆస్కార్ నామినేష‌న్‌లో స‌త్తా చాటిన స్పిన్న‌ర్స్

అక్షరటుడే, వెబ్​డెస్క్: Oscar Awards 2026  | ఆస్కార్ అవార్డ్స్ 2026కు సంబంధించిన నామినేషన్లు (Nominations) గురువారం అధికారికంగా వెలువడ్డాయి. ఈ ఏడాది నామినేషన్ ప్రకటనతో ప్రపంచ సినీ వర్గాల దృష్టిని ఒక్కసారిగా ఆకర్షించిన చిత్రం ‘సిన్నర్స్’. ఇప్పటివరకు ఆస్కార్ చరిత్రలో ఏ సినిమా సాధించని ఘనతను ఈ చిత్రం సొంతం చేసుకుంది. ఏకంగా 16 విభాగాల్లో నామినేషన్లు దక్కించుకుని కొత్త చరిత్రను లిఖించింది. ఇంతకుముందు అత్యధిక నామినేషన్ల రికార్డు 14 విభాగాలకే పరిమితమైంది. 1950లో విడుదలైన […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Oscar Awards 2026  | ఆస్కార్ అవార్డ్స్ 2026కు సంబంధించిన నామినేషన్లు (Nominations) గురువారం అధికారికంగా వెలువడ్డాయి. ఈ ఏడాది నామినేషన్ ప్రకటనతో ప్రపంచ సినీ వర్గాల దృష్టిని ఒక్కసారిగా ఆకర్షించిన చిత్రం ‘సిన్నర్స్’. ఇప్పటివరకు ఆస్కార్ చరిత్రలో ఏ సినిమా సాధించని ఘనతను ఈ చిత్రం సొంతం చేసుకుంది. ఏకంగా 16 విభాగాల్లో నామినేషన్లు దక్కించుకుని కొత్త చరిత్రను లిఖించింది.

ఇంతకుముందు అత్యధిక నామినేషన్ల రికార్డు 14 విభాగాలకే పరిమితమైంది. 1950లో విడుదలైన క్లాసిక్ మూవీ ‘ఆల్ అబౌట్ ఈవ్’, (All About Eve) 1997లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘టైటానిక్’, (Titanic) అలాగే 2016లో వచ్చిన మ్యూజికల్ హిట్ ‘లా లా ల్యాండ్’ (La La Land) చిత్రాలు ఒక్కోటి 14 విభాగాల్లో నామినేషన్లు సాధించి అప్పట్లో ఆస్కార్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి.

అయితే ఈ మూడు లెజెండరీ సినిమాల రికార్డులను ‘సిన్నర్స్’ (Sinners) ఒక్కసారిగా అధిగమించడం సినీ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీసింది. ప్రధాన విభాగాలతో పాటు సాంకేతిక విభాగాల్లోనూ విస్తృతంగా చోటు దక్కించుకోవడం ఈ చిత్రానికి ఉన్న బలాన్ని స్పష్టంగా చూపిస్తోంది. నామినేషన్ల ప్రకటనతోనే ‘సిన్నర్స్’ ఆస్కార్ రేస్‌లో ఫ్రంట్ రన్నర్‌గా నిలవడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మార్చిలో జరగనున్న అవార్డుల వేడుకలో ఈ చిత్రం ఎన్ని బంగారు విగ్రహాలు అందుకుంటుందోనన్న ఉత్కంఠ ఇప్పుడు సినీ అభిమానుల్లో పెరిగింది.

మార్చి 15వ తేదీన లాస్ ఏంజిల్స్‌లో జ‌ర‌గ‌నున్న ఆస్కార్ అవార్డుల వేడుక కోసం నామినేష‌న్స్ లో నిలిచిన చిత్రాలు ఇవే….

బెస్ట్ పిక్చర్:

బగోనియా
ఎఫ్‌-1
ఫ్రాంకిన్‌స్టన్‌
హ్యామ్‌నెట్‌
మార్టీ సుప్రీం
వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌
ది సీక్రెట్‌ ఏజెంట్‌
సెంటిమెంటల్‌ వాల్యూ
సిన్నర్స్‌
ట్రైన్‌ డ్రీమ్స్‌

బెస్ట్ డైరెక్షన్:

క్లోయి జావ్‌ – హ్యామ్‌నెట్‌
జాష్‌ షాఫ్డీ – మార్టీ సుప్రీం
పాల్‌ థామస్‌ ఆండ్రూసన్‌ – వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌
యోఆకీమ్‌ ట్రియర్‌ – సెంటిమెంటల్‌ వాల్యూ
రేయాన్‌ కూగ్లర్‌ – సిన్నర్స్‌

బెస్ట్ యాక్టర్:

తిమోతి చాలమేట్‌ – మార్టీ సుప్రీం
లియోనార్డ్‌ డికాప్రియో – వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌
ఈథన్‌ హాక్‌ – బ్లూ మూన్‌
మైఖేల్‌ బి జోర్డాన్‌ – సిన్నర్స్‌
వాగ్నర్‌ మౌరా – ది సీక్రెట్‌ ఏజెంట్‌

బెస్ట్ యాక్ట్రెస్:

జస్సీ బక్లీ – హ్యామ్‌ నెట్‌
రోజ్‌ బర్న్‌ – ఇఫ్‌ ఐ హ్యాడ్‌ లెగ్స్‌ ఐ వుడ్‌ కిక్‌ యు
కేట్‌ హడ్సన్‌ – సాంగ్‌ సంగ్‌ బ్లూ
రెనాటా రైన్సావా – సెంటిమెంటల్ వాల్యూ
ఎమ్మా స్టోన్‌ – బగోనియా

బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్:

బెనిసియో డెల్‌ టారో – వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌
జేకబ్‌ ఎల్రోడి – ఫ్రాంకిన్‌స్టన్
డెల్రాయ్‌ లిండో – సిన్నర్స్‌
షాన్‌ పెన్‌ – వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌
స్టెలెన్‌ స్కార్స్‌గార్డ్‌ – సెంటిమెంటల్‌ వాల్యూ

బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్:

ఎల్‌ ఫ్యానింగ్‌ – సెంటిమెంటల్‌ వాల్యూ
ఇంగా ఇబ్సిడాట్టర్‌ లిల్లాస్‌ – సెంటిమెంటల్‌ వాల్యూ
ఎమీ మాడిగన్‌ – వెపన్స్‌
ఉన్మి మసాకు – సిన్నర్స్‌
టియానా టేలర్‌ – వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌

బెస్ట్ క్యాస్టింగ్‌:

హ్యామ్‌నెట్‌
మార్టీ సుప్రీం
వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌
ది సీక్రెట్‌ఏజెంట్‌
సిన్నర్స్‌

బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌:

ది ఆలబామా సొల్యూషన్స్‌
కమ్స్‌ సీ మి ఇన్‌ ది గుడ్‌ లైట్‌
కటింగ్‌ థ్రూ రాక్స్‌
మిస్టర్‌ నో బడీ అగైనెస్ట్ పుతిన్‌
ది పర్‌ఫెక్ట్‌ నైబర్‌

బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌:

ఆల్‌ ది ఎంప్టీ రూమ్స్
ఆర్డ్మ్‌ ఓన్లీ విత్‌ ఏ కెమెరా: ది లైఫ్‌ అండ్‌ డెత్‌ ఆఫ్‌ బ్రెంట్‌ రెనోడ్‌
చిల్డ్రన్‌ నో మోర్‌: వర్‌ అండ్‌ ఆర్‌ గాన్‌
ది డెవిల్‌ ఈజ్‌ బిజీ
పర్‌ఫెక్ట్‌లీ ఎ స్ట్రేంజ్‌నెస్‌

బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం:

ది సీక్రెట్‌ ఏజెంట్‌ (బ్రెజిల్‌)
ఇట్‌ వాజ్‌ ఏ జస్ట్‌ యాక్సిడెంట్ (ఫ్రాన్స్‌)
సెంటిమెంటల్‌ వాల్యూ (నార్వే)
సిరాట్‌ (స్పెయిన్‌)
ది వాయిస్‌ ఆఫ్ హింద్‌ రజాబ్‌ (తునీషియా)

బెస్ట్ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌:

ఆర్కో
ఎలియో
కెపాప్‌ డెమన్‌ హంట్స్‌
లిటిల్‌ ఆమలీ ఆర్‌ ది క్యారెక్టర్‌ ఆఫ్‌ రెయిన్‌
జుప్టోపియా-2

బెస్ట్ కాస్ట్యూమ్‌ డిజైన్‌:

అవతార్‌: ఫైర్‌ అండ్‌ యాష్‌
ఫ్రాంకిన్‌స్టన్‌
హ్యామ్‌నెట్‌
మార్టీసుప్రీం
సిన్నర్స్‌

బెస్ట్ ప్రొడక్షన్‌ డిజైన్‌:

ఫ్రాంకిన్‌స్టన్‌
హ్యామ్‌నెట్‌
మార్టీ సుప్రీం
వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌
సిన్నర్స్‌

బెస్ట్ ఎడిటింగ్‌:

ఎఫ్‌1
మార్టీ సుప్రీం
వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌
సెంటిమెంటల్‌ వాల్యూ
సిన్నర్స్‌

బెస్ట్ సౌండ్‌:

ఎఫ్‌1
ఫ్రాంకిన్‌స్టన్‌
వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌
సిన్నర్స్‌
సిరాట్‌

బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌:

బగోనియా
ఫ్రాంకిన్‌స్టన్
హ్యామ్‌నెట్‌
వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌
సిన్నర్స్‌

బెస్ట్ ఒరిజినల్‌ సాంగ్‌:

డియర్‌ మి – డయాన్‌ వారెన్‌ రెలెంట్‌లెస్‌
గోల్డెన్‌ – కెపాప్‌ డెమెన్‌ హంటర్‌
ఐ లైక్డ్‌ టు యు – సిన్నర్స్‌
స్వీట్‌ డ్రీమ్స్‌ ఆఫ్‌ జాయ్‌ – వీవా వీర్డీ
ట్రైన్‌ డ్రీమ్స్‌ – ట్రైన్‌ డ్రీమ్స్‌

బెస్ట్ సినిమాటోగ్రఫీ:

ఫ్రాంకిన్‌స్టైన్‌
మార్టీ సుప్రీం
వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌
సిన్నర్స్‌
ట్రైన్‌ డ్రీమ్స్‌

బెస్ట్ విజువల్‌ ఎఫెక్ట్స్‌:

అవతార్‌: ఫైర్‌ అండ్‌ యాష్‌
ఎఫ్‌1
జురాసిక్‌ వరల్డ్‌ రీబర్త్‌
ది లాస్ట్‌ బస్‌
సిన్నర్స్‌

మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టైల్‌:

ఫ్రాంకిన్‌స్టన్
కొకుహో
సిన్నర్స్‌
ది స్మాషింగ్‌ మెషీన్‌
ది అగ్లీ స్టెప్‌ సిస్టర్‌

బెస్ట్‌ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌:

బుచర్స్‌ స్టెయిన్‌
ఎ ఫ్రెండ్‌ ఆఫ్‌ డార్ఫీ
జేన్‌ ఆస్టన్స్‌ పీరియడ్‌ డ్రామా
ది సింగర్స్‌
టూ పీపుల్‌ ఎక్స్ఛేంజ్‌ సలైవా

బెస్ట్‌ యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిల్మ్‌:

బటర్‌ఫ్లై
ఫరెవర్‌ గ్రీన్‌
ది గర్ల్‌ హూ క్రైడ్‌ పెరల్స్‌
రిటైర్మెంట్‌ ప్లాన్‌
ది త్రీ సిస్టర్స్‌

బెస్ట్‌ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే:

బ్లూమూన్‌
ఇట్‌ వాజ్‌ జస్ట్‌ యాన్‌ యాక్సిడెంట్‌
మార్టీ సుప్రీం
సెంటిమెంటల్‌ వాల్యూ
సిన్నర్స్‌

బెస్ట్‌ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే:

బగోనియా
ఫ్రాంకిన్‌స్టన్
హ్యామ్‌నెట్‌
వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌
ట్రైన్‌ డ్రీమ్స్‌

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...