అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Donald Trump | భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చెప్పుకున్నారు. ఇరు దేశాల మధ్య భీకర యుద్ధం జరుగుతోందని, అప్పటికే 7 ఫైటర్ జెట్లు కూడా కూలిపోయాయని వెల్లడించారు.
ఇది అణుయుద్ధంగా మారుతున్న క్రమంలో తానే వాణిజ్య హెచ్చరికల ద్వారా ఇరు దేశాల యుద్ధాన్ని నివారించానని పేర్కొన్నారు. వైట్ హౌస్‌లో దక్షిణ కొరియా అధ్యక్షుడితో జరిగిన ద్వైపాక్షిక భేటీ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. తానే భారతదేశం-పాకిస్తాన్ (India – Pakistan)వివాదాన్ని ముగించానని చెప్పుకున్నారు. వాణిజ్యాన్ని తెగతెంపులు చేసుకుంటానని బెదిరించడం ద్వారా ఇరు దేశాల భీకరమైన యుద్ధాన్ని ఆపానని ట్రంప్ పేర్కొన్నారు. అయితే, ఈ యుద్ధంలో ఐదు జెట్‌లు కూలిపోయాయని గతంలో చెప్పిన ట్రంప్.. ఇప్పుడు ఏడు జెట్లు నేలకూలాయని చెప్పడం గమనార్హం.
Donald Trump | వాణిజ్యంతో యుద్ధాలను ఆపా..
వాణిజ్యాన్ని ఆయుధంగా చేసుకుని అనేక యుద్ధాలను ఆపినట్లు ట్రంప్(Donald Trump) పునరుద్ఘాటించారు. భారత్, పాకిస్తాన్ మధ్య నాలుగు రోజుల పాటు సాగిన భీకర యుద్ధాన్ని కూడా తానే ఆపానని చెప్పారు. “నేను ఈ యుద్ధాలన్నింటినీ ఆపాను. ఇండియా, పాకిస్తాన్ దాడులు, ప్రతిదాడులతో యుద్ధాన్ని తీవ్రతరం చేశాయి. ఇది అణుయుద్ధంగా మారేది. అప్పటికే వారు ఇప్పటికే 7 జెట్‌లను కూల్చివేశారు. ఈ క్రమంలో నేను జోక్యం చేసుకున్నా. మీరు మాతో వ్యాపారం చేయాలనుకుంటున్నారా.. లేదా? అని హెచ్చరించారు. మీరు యుద్ధాన్ని కొనసాగిస్తే మీతో ఎలాంటి వాణిజ్యం ఉండదని స్పష్టంగా చెప్పా. వారికి 24 గంటల సమయమిచ్చా. వారు ‘సరే, ఇక యుద్ధం ఆపేస్తున్నామని’ అని చెప్పారని” అని ట్రంప్ పేర్కొన్నారు. గతంలో ఐదు జెట్లు కూలిపోయాయన్న ట్రంప్.. ఇప్పుడా సంఖ్యను ఏడుకు పెంచారు. అయితే, ఏ దేశానికి చెందిన జెట్లు కూలిపోయాయన్నది ఆయన వెల్లడించలేదు.
యుద్ధ విరమణలో ఎవరి పాత్ర లేదని భారత్ పలుమార్లు స్పష్టీకరించినప్పటికీ, తానే మధ్యవర్తిత్వం వహించినట్లు ట్రంప్ పదేపదే చెబుతుండడం గమనార్హం. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)ను ఆపడానికి వాణిజ్యాన్ని పరపతిగా ఉపయోగించడం గురించి ట్రంప్‌తో లేదా అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌తో ఎప్పుడూ సంభాషణ జరగలేదని కేంద్రం స్పష్టం చేసింది. ఆపరేషన్ సిందూర్ పై జరిగిన పార్లమెంటరీ చర్చ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) స్వయంగా మాట్లాడుతూ, “ఆపరేషన్ సిందూర్ ను ఆపమని ఏ ప్రపంచ నాయకుడూ భారతదేశాన్ని అడగలేదు” అని వెల్లడించారు.
“మా వద్ద కనీసం ఐదు యుద్ధ విమానాలు చంపబడ్డాయని నిర్ధారించబడ్డాయి మరియు ఒక పెద్ద విమానం, ఇది ELINT (ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్) విమానం లేదా AEW&C (ఎయిర్‌బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్) విమానం కావచ్చు, దీనిని దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో తీసుకున్నారు. ఇది వాస్తవానికి మనం మాట్లాడగలిగే అతిపెద్ద ఉపరితలం నుండి గాలికి చంపడం, ”అని ఆయన ఈ నెల ప్రారంభంలో అన్నారు.
ఆపరేషన్ సమయంలో భారతదేశం నిర్వహించిన విస్తృత దాడులను ఆయన మరింత వివరించారు. “మురిద్ మరియు చక్లాలా వంటి కనీసం రెండు కమాండ్ మరియు కంట్రోల్ కేంద్రాలను మేము పొందగలిగాము. కనీసం ఆరు రాడార్లు, వాటిలో కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవి. లాహోర్ మరియు ఒకారాలో ఉన్న రెండు SAGW వ్యవస్థలు. మేము మూడు హ్యాంగర్లపై దాడి చేసాము. ఒకటి సుక్కూర్ UAV హ్యాంగర్, భోలారి హ్యాంగర్ మరియు జకోబాబాద్ F-16 హ్యాంగర్. ఆ AEW&C హ్యాంగర్‌లో కనీసం ఒక AEW&C మరియు కొన్ని F-16లు నిర్వహణలో ఉన్నాయని మాకు సూచన ఉంది,” అని అధికారి చెప్పారు.
