Bank Holidays | డిసెంబర్‌లో బ్యాంకులకు 7 రోజులు సెలవులు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bank Holidays | దేశంలోని బ్యాంకులకు సంబంధించిన సెలవుల జాబితాను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(Reserve Bank of India) విడుదల చేస్తుంటుంది. డిసెంబర్‌ నెలకు సంబంధించిన సెలవుల జాబితా విడుదలయ్యింది. అన్ని రాష్ట్రాలలో సెలవులు ఒకే రకంగా ఉండవు. ఈ సెలవులు పండుగలు, ప్రాంతీయ ఉత్సవాలు, వారాంతపు సెలవుల కలయికగా ఉంటాయి. దీని ప్రకారం కొన్ని రాష్ట్రాలలో సగానికిపైగా సెలవులు రాగా.. తెలంగాణలో ఏడు సెలవులు వచ్చాయి. ఆ ఏడు రోజులు […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bank Holidays | దేశంలోని బ్యాంకులకు సంబంధించిన సెలవుల జాబితాను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(Reserve Bank of India) విడుదల చేస్తుంటుంది. డిసెంబర్‌ నెలకు సంబంధించిన సెలవుల జాబితా విడుదలయ్యింది. అన్ని రాష్ట్రాలలో సెలవులు ఒకే రకంగా ఉండవు.

ఈ సెలవులు పండుగలు, ప్రాంతీయ ఉత్సవాలు, వారాంతపు సెలవుల కలయికగా ఉంటాయి. దీని ప్రకారం కొన్ని రాష్ట్రాలలో సగానికిపైగా సెలవులు రాగా.. తెలంగాణలో ఏడు సెలవులు వచ్చాయి. ఆ ఏడు రోజులు బ్యాంకులు బంద్‌ ఉన్నా.. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌(Online Banking), మొబైల్‌ బ్యాంకింగ్‌, యూపీఐ వంటి సేవలతోపాటు ఏటీఎం సేవలు ఎప్పటిలాగే కొనసాగుతాయి.

Bank Holidays | సాధారణ సెలవులు (దేశవ్యాప్తంగా ఒకేరకంగా ఉంటాయి)..

డిసెంబర్‌లో బ్యాంకులకు ఆరు సాధారణ సెలవులు వచ్చాయి. ఇందులో 4 ఆదివారాల(డిసెంబర్‌ 7, 14, 21, 28)తోపాటు రెండో శనివారం(డిసెంబర్‌ 13), నాలుగో శనివారం(డిసెంబర్‌ 27) ఉన్నాయి. అలాగే క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబర్‌ 25న దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు.

Bank Holidays | ప్రాంతీయ సెలవులు..

ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవు. కొన్ని ప్రాంతాలకే ప్రత్యేకమైనవి.

  • డిసెంబర్‌ 1: స్టేట్‌ ఇనాగరేషన్‌ డే, విశ్వాస దినం సందర్భంగా అరుణాచల్‌ ప్రదేశ్‌, నాగాలాండ్‌లలో బ్యాంకులకు సెలవు.
  • డిసెంబర్‌ 3: సెయింట్‌ ఫ్రాన్సిస్‌ జేవియర్‌ డెత్‌ యానివర్సరీ సందర్భంగా గోవాలో సెలవు.
  • డిసెంబర్‌ 12: ‘పా టోగన్‌ నెంగ్మింజా సంగ్మా’ వర్ధంతి సందర్భంగా మేఘాలయలో సెలవు.
  • డిసెంబర్‌ 18: ఛత్తీస్‌గఢ్‌లో గురు ఘాసిదాస్‌ జయంతి, మేఘాలయలో యు సోసో థామ్‌ వర్ధంతి సందర్భంగా సెలవు.
  • డిసెంబర్‌ 19: గోవా విమోచన దినోత్సవం సందర్భంగా గోవాలో సెలవు.
  • డిసెంబర్‌ 20, 22 : లోసూంగ్‌, నామ్సంగ్‌ పండుగ సందర్భంగా సిక్కింలో సెలవులు.
  • డిసెంబర్‌ 24: క్రిస్మస్‌ ఈవ్‌ సందర్భంగా మిజోరాం, మేఘాలయ, నాగాల్యాండ్‌ రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు.
  • డిసెంబర్‌ 26: క్రిస్మస్‌ బాక్సింగ్‌ డే సందర్భంగా మిజోరాం, మేఘాలయ, నాగాల్యాండ్‌ రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు. హర్యానాలో అమరవీరుడు ఉధమ్‌ సింగ్‌ జయంతి సందర్భంగా అక్కడి బ్యాంకులకు సెలవు.
  • డిసెంబర్‌ 27: పంజాబ్‌, హర్యానాలలో గురు గోవింద్‌ సింగ్‌ జయంతి సందర్భంగా ఆ రాష్ట్రాలలోని బ్యాంకులకు సెలవు.
  • డిసెంబర్‌ 30: యు కియాంగ్‌ నంగ్బా వర్ధంతి సందర్భంగా మేఘాలయలోని బ్యాంకులకు, తము లోసర్‌ రోజున సిక్కింలోని బ్యాంకులకు సెలవు.
  • డిసెంబర్‌ 31: న్యూ ఇయర్‌ ఈవ్‌ సందర్భంగా మిజోరాం, మణిపూర్‌ రాష్ట్రాలలోని బ్యాంకులకు సెలవు

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...