అక్షరటుడే, ఇందూరు : Prajavani Nizamabad | ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టరేట్లో (District Collectorate) సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 68 ఫిర్యాదులు అందాయి.
Prajavani Nizamabad | జిల్లా నలుమూలల నుంచి..
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్‌తో (Additional Collector Kiran Kumar) పాటు నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, హౌసింగ్ పీడీ పవన్ కుమార్, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో సాయన్నలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా.. అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.