అక్షరటుడే, వెబ్‌డెస్క్: Maoists surrender | మావోయిస్టు పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలు ఎన్కౌంటర్లలో అత్యంత కీలక నేతలు మరణించారు. ఈ క్రమంలో ఇటీవల కాలంలో వందల సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోతున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో 52 మంది మావోయిస్టులు లొంగిపోయారు. కాగా.. లొంగిపోయిన వారిలో 21 మంది మహిళలు ఉన్నట్లు సమాచారం. లొంగిపోయిన మావోయిస్టులపై రూ.1. 14 కోట్ల రివార్డు ఉంది.
Maoists surrender | గత రెండు నెలల్లో..
కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను ఏరివేసేందుకు ఆపరేషన్ కగార్‌ను కొనసాగిస్తోంది. దీంతో భద్రతా దళాలు ఇప్పటికే విజయం సాధిస్తూ వెళ్తున్నాయి. అయితే మావోయిస్టు దళాలు.. జనజీవన స్రవంతిలోకి రావాలని కేంద్రం పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఇటీవల కాలంలో భారీగా లొంగిపోతున్నారు. రెండు నెలల్లో దేశవ్యాప్తంగా 120కి పైగా మావోలు లొంగిపోయినట్లు సమాచారం.