Homeజిల్లాలునిజామాబాద్​Local Body Elections | నిజామాబాద్‌ రూరల్‌లో బీసీలకు 51.6 శాతం రిజర్వేషన్లు: రూరల్ ఎమ్మెల్యే...

Local Body Elections | నిజామాబాద్‌ రూరల్‌లో బీసీలకు 51.6 శాతం రిజర్వేషన్లు: రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి

గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 51.6 శాతం రిజర్వేషన్లు కల్పించామని ఎమ్మెల్యే డాక్టర్‌ ఆర్. భూపతిరెడ్డి తెలిపారు. నగర శివారులోని క్యాంప్​ కార్యాలయంలో గురువారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే నిజామాబాద్‌ సిటీ: Local Body Elections | గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 51.6 శాతం రిజర్వేషన్లు కల్పించామని ఎమ్మెల్యే డాక్టర్‌ ఆర్. భూపతిరెడ్డి (MLA Dr. R. Bhupathi Reddy) తెలిపారు.

నగర శివారులోని క్యాంప్​ కార్యాలయంలో గురువారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో 126 నాన్‌ షెడ్యూల్‌ గ్రామపంచాయతీలు (non-schedule Gram Panchayats) ఉన్నాయని, వాటిలోని 64 జనరల్‌ స్థానాల్లో 32 సీట్లు బీసీలకు కేటాయించామని తెలిపారు. బీసీల రిజర్వేషన్లను 51.6 శాతం వరకూ పెంచి సామాజిక న్యాయాన్ని అమలు చేశామని అన్నారు.

Local Body Elections | కామారెడ్డి బీసీ డిక్లరేషన్​లో..

కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో (Kamareddy BC declaration) పేర్కొన్న విధంగా 42శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి కాంగ్రెస్‌ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. బీజేపీ,బీఆర్‌ఎస్ కలిసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు రాకుండా అడ్డుకుంటున్నాయని విమర్శించారు. బీజేపీ ఎంపీలు పార్లమెంట్‌లో బీసీ బిల్లుపై రాజకీయ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Local Body Elections | ఏకగ్రీవ జీపీలకు ప్రోత్సాహకం

నియోజకవర్గంలో ఏకగ్రీవమైన మేజర్‌ గ్రామపంచాయతీలకు ప్రత్యేక నిధుల నుంచి రూ.20 లక్షలు, మైనర్‌ జీపీలకు రూ.10 లక్షల ప్రోత్సాహకం ఇస్తామని ఎమ్మెల్యే భూపతిరెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ తరఫున ఇప్పటికే ఏకగ్రీవ జీపీలకు రూ.10 లక్షలు ప్రకటించారని గుర్తుచేశారు. ఇప్పటివరకు 33 జీపీలు ఏకగ్రీవమయ్యాయని, మరో రెండు రోజుల్లో మరికొన్ని ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉందని తెలిపారు.

సమావేశంలో ఏఎంసీ ఛైర్మన్‌ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్‌ బాడ్సి శేఖర్‌ గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్కోల్‌ భాస్కర్‌రెడ్డి, ఎస్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు కెతావత్‌ యాదగిరి, నాయకులు మునిపల్లి సాయిరెడ్డి, బాగారెడ్డి, అమృతాపూర్‌ గంగాధర్‌, నవీన్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News