అక్షరటుడే, ఇందూరు : BC Reservations | మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) జనరల్ స్థానాల్లో బీసీ అభ్యర్థులకు పార్టీ పరంగా 50 శాతం సీట్లను కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ (Narala Sudhakar) కోరారు. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు (PCC Chief Mahesh Kumar Goud) బుధవారం వినతిపత్రం అందజేశారు.
BC Reservations | 60 శాతం జనాభా..
ఈ సందర్భంగా నరాల సుధాకర్ మాట్లాడుతూ జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకు 32శాతం రిజర్వేషన్లు సరిపోవన్నారు. కాబట్టి జనరల్ స్థానాల్లో 50 శాతం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం (State Government) బీసీలకు 42శాతం రిజర్వేషన్లను కల్పించడానికి కృషి చేయడం హర్షణీయమని.. కానీ కొందరు బీసీ వ్యతిరేకులు కోర్టుకు వెళ్లడంతో ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. అందుకు పార్టీ పరంగా రిజర్వేషన్లు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు శంకర్, శ్రీలత, చంద్రకాంత్, సాయి, బాలన్న తదితరులు పాల్గొన్నారు.