Home » Panchayat elections | రెండో దశలో 415 సర్పంచులు ఏకగ్రీవం

Panchayat elections | రెండో దశలో 415 సర్పంచులు ఏకగ్రీవం

by tinnu
0 comments
Panchayat elections

అక్షరటుడే, వెబ్​డెస్క్: Panchayat elections | రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల (Panchayat elections) సందడి నెలకొంది. చాలా రోజుల నిరీక్షణ తర్వాత ఎన్నికలు జరుగుతుండటంతో ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు. చాలా గ్రామాల్లో పోటాపోటీగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ సారి ఎన్నికల్లో ఏకగ్రీవాల జోరు కొనసాగుతోంది. చాలా గ్రామాల్లో ప్రజలు సమష్టిగా నిర్ణయం తీసుకొని ఏకగ్రీవంగా సర్పంచ్​, వార్డు సభ్యులను (Sarpanch and ward members) ఎన్నుకుంటున్నారు. మూడు దశల్లో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.

రెండో దశ ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. దీంతో ఏకగ్రీవం అయిన పంచాయతీల సంఖ్య తేలింది. రెండో దశలో ఏకంగా 415గ్రామాలు ఏకగ్రీవం కావడం గమనార్హం. రెండో విడతలో మొత్తం 4,332 సర్పంచ్​, 38,342 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే 415 మంది సర్పంచ్​లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 8,304 వార్డులు సైతం యూననమస్​గా గెలుపొందడం గమనార్హం. అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో (Kamareddy district) 44 గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో (Nalgonda and Nizamabad districts) 38 మంది చొప్పున సర్పంచులను యునానమస్​గా గెలిపించారు. అత్యల్పంగా ఆసిఫాబాద్ జిల్లాలో ఒక సర్పంచ్​ మాత్రమే ఏకగ్రీవం అయ్యారు.

కాగా తొలిదశలో సైతం 395 సర్పంచ్​ స్థానాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నెల 11న తొలి విడత ఎన్నికలు జరగున్నాయి. 14న రెండో విడత, 17న మూడో విడత పోలింగ్​ ఉంటుంది. మూడో విడత నామినేషన్ల విత్​డ్రా తర్వాత ఏకగ్రీవాల సంఖ్య తేలనుంది. ఈ ఏడాది పలు గ్రామాల్లో అభ్యర్థులు పోటీకి ఆసక్తి చూపడం లేదు. దీంతో ఏకగ్రీవాల జోరు కొనసాగుతోంది. మరోవైపు పలు ప్రాంతాల్లో వేలం పాట ద్వారా సర్పంచులను ఎన్నుకుంటున్నారు.

You may also like