అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Liquor shops | మద్యం షాపుల టెండర్ల కోసం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో శనివారం 34 దరఖాస్తులు వచ్చాయి.
జిల్లాలోని 102 వైన్ షాప్‌లకు గాను ఇప్పటి వరకు 149 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ఎక్సైజ్ (Excise Department) సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. నిజామాబాద్ స్టేషన్ పరిధిలో మొత్తం 36 వైన్ షాప్‌లకు 53 దరఖాస్తులు, బోధన్ (Bodhan) స్టేషన్ పరిధిలో 18 దుకాణాలకు 23, ఆర్మూర్(Armoor) పరిధిలో 25 వైన్ షాప్‌లకు 36, భీమ్‌గల్ (Bheemgal) పరిధిలో 12 షాప్‌లకు 22, మోర్తాడ్ స్టేషన్ పరిధిలో మొత్తం 11 దుకాణాలకు 15 దరఖాస్తులు వచ్చాయని మల్లరెడ్డి పేర్కొన్నారు.