అక్షరటుడే, కామారెడ్డి : Drunk and Drive | జిల్లా వ్యాప్తంగా పోలీసులు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరంగా చేపడుతున్నారు. గత రెండు రోజుల్లో 101 మంది మందుబాబులు పోలీసులకు చిక్కారు. ఇందులో 31 మందికి కోర్టు ఒకరోజు జైలుశిక్ష విధించింది.
Drunk and Drive | కామారెడ్డి పోలీస్‌స్టేషన్ పరిధిలో..
కామారెడ్డి పోలీస్‌స్టేషన్ (Kamareddy Police Station) పరిధిలో 49 మందికి రూ.49 వేలు జరిమానా విధించగా ఇందులో 20 మందికి ఒక రోజు జైలుశిక్ష విధించింది. దేవునిపల్లి (Devunipalli) పరిధిలో 24 మందికి రూ.24 వేలు జరిమానా విధించగా ఇందులో ఇద్దరికి ఒక రోజు జైలు శిక్ష, తాడ్వాయి పరిధిలో ఒకరికి వెయ్యి జరిమానా, ఒకరోజు జైలుశిక్ష విధించారు. మాచారెడ్డి పరిధిలో ఐదుగురికి రూ.5వేలు జరిమానా ముగ్గురికి ఒకరోజు జైలు శిక్ష విధించింది. భిక్కనూరు పరిధిలో 14 కేసులు మందికి రూ.15 వేలు జరిమానా విధించగా ఇద్దరికి ఒకరోజు జైలుశిక్ష విధించింది. దోమకొండ (Domakonda) పరిధిలో ఐదుగురికి రూ.5 వేలు జరిమానా ముగ్గురికి ఒక రోజు జైలుశిక్ష, బీబీపేట్ పరిధిలో ఇద్దరికి రూ.2 వేలు జరిమానా, రాజంపేట్ పరిధిలో ఒకరికి రూ.వెయ్యి జరిమానా విధించింది.
జిల్లాలో గత రెండు రోజుల్లో మొత్తం 101 కేసులు నమోదు కాగా కోర్టు రూ.1.01 లక్షల జరిమానా విధించింది. ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్‌చంద్ర (SP Rajesh Chandra) మాట్లాడుతూ.. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపవద్దన్నారు.